HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Layoffs : 80శాతం మంది ఉద్యోగులను తొలగించిన సంస్థ.. మూడు నెలల జీతాలు ఇవ్వకుండానే!

Layoffs : 80శాతం మంది ఉద్యోగులను తొలగించిన సంస్థ.. మూడు నెలల జీతాలు ఇవ్వకుండానే!

Sharath Chitturi HT Telugu

24 June 2024, 11:50 IST

    • ReshaMandi employees : బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్​.. 80శాతం మంది ఉద్యోగులను తొలగించింది. అంతేకాదు మూడు నెలల జీతాలు ఇవ్వకుండానే విధుల నుంచి తప్పించింది!
80శాతం మంది ఉద్యోగులను తొలగించిన సంస్థ!
80శాతం మంది ఉద్యోగులను తొలగించిన సంస్థ!

80శాతం మంది ఉద్యోగులను తొలగించిన సంస్థ!

ReshaMandi shutdown : బెంగళూరుకు చెందిన రేషామండి అనే సిల్క్​ యార్న్​ ఉత్పత్తుల సంస్థ.. తన కంపెనీలోని 80శాతం ఉద్యోగులను తొలగించింది. సిరీస్ బీ ఫండింగ్ పొందడంలో విఫలం అవ్వడంతో ఆ స్టార్టప్​ సంస్థ ఉద్యోగులను తొలగించింది. గత సంవత్సరం నుంచి కంపెనీ తన కార్యకలాపాలను తగ్గిస్తూ వస్తోంది. జనవరి 2023లో 500 మంది ఉద్యోగులను కలిగి ఉన్న ఈ సంస్థ.. ఏడాది చివరి నాటికి ఈ నెంబర్​ 100కు పడిపోయింది. వీరిలో దాదాపు 300 మంది ఉద్యోగులు తమ చివరి జీతాలు కోసం ఇంకా ఎదురు చూస్తున్నారని సమాచారం.

వాస్తవానికి.. రేషామండి సంస్థ ఇలా ఉండేది కాదు! 2021 అక్టోబర్​లో భారీ మొత్తంలో నిధులను సమీకరించుకుని వ్యాపారాన్ని విస్తరించుకుంది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి పడిపోయింది.

“గ్రోత్ ఎట్ ఆల్ కాస్ట్ మైండ్​సెట్​కి కంపెనీ బలైపోయింది. ఫలితంగా 2023, 2022 ఆర్థిక సంవత్సరంలో ఇన్​ఫ్లేట్​ రెవెన్యూని చూపించింది. మా పరిస్థితి, తాజా స్థితిని సోషల్​ మీడియా ద్వారా ఇన్​వెస్టర్లు చూసి ఉంటారు,” రేషామండి ఉద్యోగులు చెబుతున్నారు.

ReshaMandi layoffs : రేషామండిని 2020 లో స్థాపించడం జరిగింది. క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్స్, ఓమ్నివోర్, వెంచర్ క్యాటలిస్ట్స్ వంటి పెట్టుబడిదారుల నుంచి 40 మిలియన్ డాలర్లకు పైగా ఈక్విటీ నిధులను సేకరించింది. వెంచర్ డెట్ ఇన్వెస్టర్లు, రుణదాతల నుంచి కంపెనీ దాదాపు రూ.300 కోట్ల రుణాన్ని పొందింది.

ReshaMandi news : కానీ కంపెనీ ఆ తర్వాత.. అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. ఆ భారాన్ని సంస్థ భరించలేకపోయింది. ఫలితంగా జూన్ 2023 నుంచి ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టింది సంస్థ. ఉద్యోగుల తొలగింపుకు ముందు.. వారికి మూడు నెలలు జీతాలు కూడా ఇవ్వలేదని సమాచారం. చాలా మంది ఇప్పటికీ జీతాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారట.

మైక్రోసాఫ్ట్ లో మళ్లీ లే ఆఫ్స్..

మైక్రోసాఫ్ట్ మరోసారి లే ఆఫ్స్ బాట పట్టింది. 2023లో 10,000 మంది ఉద్యోగులను తొలగించిన నంబర్ వన్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్.. మరో 1000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కొన్ని వారాల క్రితం ప్రకటించింది.

మైక్రోసాఫ్ట్​లోని వివిధ యూనిట్లలో 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగిస్తుందని, చాలా వరకు ఈ ఉద్యోగాల కోతలు కంపెనీ స్ట్రాటజిక్ మిషన్స్ అండ్ టెక్నాలజీస్ విభాగంలో ఉన్నాయని సమాచారం. ఈ విభాగం టెలికాం సంస్థలు, అంతరిక్ష కంపెనీలు వంటి అత్యంత నిర్దిష్ట అవసరాలు ఉన్న వ్యాపారాలకు క్లౌడ్ సాఫ్ట్వేర్, సర్వర్ సేవలను అందిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్