Paytm layoffs news : వేలాది మంది ఉద్యోగులను తొలగించిన పేటీఎం..!
Paytm layoffs news : పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్.. వేలాది మంది ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్‌తో పని సులభంగా అవుతుండటం ఇందుకు కారణం!
Paytm layoffs news : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించుకుని, కాస్ట్ కటింగ్ చేయాలని భావిస్తున్న ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం.. సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా.. 1000కుపైగా మంది ఉద్యోగులను పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తొలగించినట్టు సమాచారం. సేల్స్, ఇంజినీరింగ్‌తో పాటు అనేక విభాగలపై ఈ పేటీఎం లేఆఫ్ ఎఫెక్ట్ పడింది!
పేటీఎం లేఆఫ్ 2023..
ఖర్చులను తగ్గించుకుని, ఎఫీషియెన్సీని పెంచుకుని, కోర్ బిజినెస్‌ని మెరుగుపరుచుకునే క్రమంలో.. ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్వైపు అడుగులు వేస్తోంది పేటీఎం. ఏఐ వల్ల ఎంప్లాయీ కాస్ట్లో తమకు 10శాతం మిగులుతుందని సంస్థ చెప్పడం గమనార్హం. కాస్ట్ కటింగ్‌తో పాటు ఊహించిన దాని కన్నా రెట్టింపు ఎఫీషియెన్స్తో పని జరుగుతోందని స్పష్టం చేసింది.
Paytm layoffs 2023 : "మా కార్యకలాపాలకు ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్ శక్తిని ఇస్తున్నాము. ఫలితంగా మాటిమాటికీ చేసే పనులు తగ్గుతాయి. ఖర్చులు తగ్గుతాయి. అందుకే మా సిబ్బందిని తగ్గించుకోవాల్సి వచ్చింది. మేము ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాల్ని ఇస్తోంది ఏఐ. దాని వల్ల మాకు 10-15 శాతం ఖర్చులు ఆదా అవుతున్నాయి. దీనితో పాటు ఏడాది పొడవునా పర్ఫార్ఫెన్స్ రివ్యూ చేస్తాము," అని పేటీఎం ఓ ప్రకటనలో తెలిపింది.
ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్‌పై ఫోకస్ చేయాలని పేటీఎం ఉద్యోగులకు ఆ సంస్థ ఫౌండర్- సీఈఓ విజయ్ శేఖర్ శర్మ చెబుతున్నట్టు సమాచారం. టెక్నాలజీ, ప్రాడక్ట్, ఇంజినీరింగ్ బృందాలు.. మైక్రోసాఫ్ట్ కార్ప్, గూగుల్ ఏఐ టూల్స్‌ల పట్టు సాధించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఆ టూల్స్‌ని ఉపయోగించుకోవడంతో.. సాధారణంగా వారాలు పట్టే ప్రాడక్ట్ డెవలప్మెంట్.. కొన్ని రోజుల్లోనే రెడీ అయిపోయింది.
Paytm layoffs latest news : నాన్- పర్ఫార్మెన్స్ కింద.. 2021లో 500 నుంచి 700 మంది ఉద్యోగులను తొలగించింది పేటీఎం. ఇక ఇప్పుడు ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్ పేరుతో మరికొందరిని లేఆఫ్ చేసింది.
అయితే.. కోర్ బిజినెస్ కోసం మ్యాన్ పవర్‌ని పెంచాలని సంస్థ భావిస్తోందట. వచ్చే ఏడాదిలో 15వేల మందికిపైగా ఉద్యోగులను కొత్తగా యాడ్ చేసుకోవాలని సంస్థ చూస్తున్నట్టు సమాచారం. సంస్థ చేపడుతున్న చర్యలతో ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతామని పేటీఎం పేర్కొంది.
సంబంధిత కథనం