తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Most Valuable Global Brands: ప్రపంచంలోని అత్యంత విలువైన 100 బ్రాండ్స్ లో నాలుగు భారతీయ కంపెనీలకు స్థానం

Most Valuable global brands: ప్రపంచంలోని అత్యంత విలువైన 100 బ్రాండ్స్ లో నాలుగు భారతీయ కంపెనీలకు స్థానం

HT Telugu Desk HT Telugu

13 June 2024, 15:29 IST

google News
  • 100 most valuable global brands: బ్రాండ్ వాల్యూ పరంగా ప్రపంచంలోని అత్యంత విలువైన 100 కంపెనీల జాబితాను ‘ కాంటార్ బ్రాండ్జ్’ (Kantar BrandZ) సంస్థ వెల్లడించింది. ఈ లిస్ట్ లో భారత్ కు చెందిన నాలుగు కంపెనీలు ఉన్నాయి. అయితే, వాటిలో భారత్ లో అత్యంత ప్రముఖ పారిశ్రామిక సంస్థ అయిన రిలయన్స్ లేకపోవడం విశేషం.

టాప్ 100 గ్లోబల్ బ్రాండ్స్ లో 4 ఇండియన్ కంపెనీలు
టాప్ 100 గ్లోబల్ బ్రాండ్స్ లో 4 ఇండియన్ కంపెనీలు (REUTERS)

టాప్ 100 గ్లోబల్ బ్రాండ్స్ లో 4 ఇండియన్ కంపెనీలు

100 most valuable global brands: ఈ ఏడాది అత్యంత విలువైన 100 గ్లోబల్ బ్రాండ్ల జాబితాలో నాలుగు భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ‘ కాంటార్ బ్రాండ్జ్’ (Kantar BrandZ) మోస్ట్ వాల్యూబుల్ గ్లోబల్ బ్రాండ్స్ రిపోర్టులో ఆపిల్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

46 వ స్థానంలో టీసీఎస్

ఈ ఏడాది అత్యంత విలువైన 100 గ్లోబల్ బ్రాండ్ల జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC bank), ఎయిర్టెల్ (airtel), ఇన్ఫోసిస్ (INFOSYS) కంపెనీలు చోటు సంపాదించాయి. సుమారు 44.8 బిలియన్ డాలర్ల విలువతో టీసీఎస్ 46వ అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్ గా అవతరించగా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 43.3 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో 47వ స్థానంలో నిలిచింది. ఎయిర్ టెల్ సుమారు 25.3 బిలియన్ డాలర్ల విలువతో 73వ స్థానంలో నిలవగా, ఇన్ఫోసిస్ 24.7 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో 74వ స్థానంలో ఉంది. టాప్ 100 జాబితాలో ఉన్న అన్ని భారతీయ బ్రాండ్ల ఉమ్మడి బ్రాండ్ విలువ 130 బిలియన్ డాలర్లు దాటింది.

నంబర్ వన్ గా ఆపిల్ సంస్థ

ఈ ఏడాది ‘ కాంటార్ బ్రాండ్జ్’ (Kantar BrandZ) రూపొందించిన అత్యంత విలువైన 100 గ్లోబల్ బ్రాండ్ల జాబితాలో తొలి స్థానంలో ఆపిల్ నిలిచింది. ర్యాంక్ ల వారీగా కంపెనీల పేర్లు.

ర్యాంక్ 1: ఆపిల్ వరుసగా మూడవ సంవత్సరం 1 ట్రిలియన్ డాలర్ల విలువను అధిగమించి ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్ గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

ర్యాంక్ 2: మొత్తం బ్రాండ్ విలువ 753.5 బిలియన్ డాలర్లతో గూగుల్ రెండో స్థానంలో ఉంది.

ర్యాంక్ 3: మైక్రోసాఫ్ట్ 712.9 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో మూడో స్థానంలో ఉంది.

ర్యాంక్ 4: అమెజాన్ 576.6 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో నాలుగో స్థానంలో ఉంది.

ర్యాంక్ 5: మెక్ డొనాల్డ్స్ 221.9 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఐదో స్థానంలో ఉంది.

ర్యాంక్ 6: ఎన్విడియా 201.8 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఆరో స్థానంలో నిలిచింది.

ర్యాంక్ 7: 188.9 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ‘వీసా’ ఏడో స్థానంలో నిలిచింది.

ర్యాంక్ 8: 166.8 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఫేస్ బుక్ ఎనిమిదో స్థానంలో ఉంది.

ర్యాంక్ 9: 145.5 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఒరాకిల్ తొమ్మిదో స్థానంలో ఉంది.

ర్యాంక్ 10: 135.2 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో టెన్సెంట్ టాప్ 10లో నిలిచింది.

అడ్వాన్స్ డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చుట్టూ ఉన్న ఉత్సాహం కారణంగా బిజినెస్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ ప్లాట్ ఫామ్స్ కేటగిరీ వేగంగా వృద్ధి చెందుతోందని, మొత్తం విలువలో 45 శాతం పెరుగుదల కనిపిస్తోందని నివేదిక పేర్కొంది.

తదుపరి వ్యాసం