Tesla Gigafactory : ప్రతి 40 సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ కారు తయారయ్యే ఫ్యాక్టరీ ఇది!
30 July 2023, 14:38 IST
- Tesla Gigafactory Shanghai : చైానాలోని షాంఘైలో టెస్లాకు ఓ పెద్ద ఫ్యాక్టరీ ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఇక్కడ 40 సెకన్లకు ఓ ఈవీ తయారవుతోందని మీకు తెలుసా?
ప్రతి 40 సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ కారు తయారయ్యే ఫ్యాక్టరీ ఇది!
Tesla Gigafactory Shanghai : దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టెస్లా సామర్థ్యాన్ని చాటిచెప్పే వార్త ఇది! చైనా షాంఘైలోని టెస్లాకు చెందిన గిగాఫ్యాక్టరీలో.. ప్రతి 40 సెకన్లకు ఓ ఎలక్ట్రిక్ వాహనం తయారవుతోంది. ఈ విషయం ఓ ట్విట్టర్ వీడియో ద్వారా తెలిసింది. సంస్థ మేన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌కు, ప్రొడక్టివిటీకి, ఎఫీషియన్సీ సామర్థ్యాన్ని ఈ విషయం చాటిచెబుతోంది.
ఫోర్డ్ సంస్థకు మించి..!
చైనాలో టెస్లాకు అతిపెద్ద మేన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఉంది. ఇక్కడ తయారు చేసిన వాహనాలు ఆసియాతో పాటు పాశ్చ్యాత్య దేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. కానీ.. 40 సెకన్లకు ఓ మోడల్ 3/ మోడల్ వై కారు తయారవుతుండటం పెద్ద విషయమే. ఈ అంశంలో మరో దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్‌ను టెస్లా వెనక్కి నెట్టేసింది. అమెరికా డియర్‌బార్న్ ట్రక్ ప్లాంట్‌లో 49 సెకన్లకు ఓ ఎఫ్-150 పికప్ ట్రక్‌ను తయారు చేస్తున్నట్టు ఈ ఏడాది తొలినాళ్లల్లో చెప్పుకొచ్చింది ఫోర్డ్.
టెస్లాకు అమెరికాలో ఓ మేన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఉంది. అమెరికా బయట.. చైనాలో మాత్రమే ఓ ఫ్యాక్టరీ ఉంది. షాంఘైలో ఉన్న ప్లాంట్‌కు సంబంధించి.. ఓ మహిళ తాజాగా ఓ వీడియో తయారు చేసింది. దానిని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. టెస్లా ఫ్యాక్టరీ మొత్తాన్ని ఆమె చుట్టేసింది. అక్కడి సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడింది. పలు వివరాలు తెలుసుకుంది. ప్రొడక్షన్లో తాము ఎందుకు అంత ఎఫీషియంట్‌గా ఉన్నామనే విషయాన్ని అక్కడి సిబ్బంది, ఆమెకు వివరించారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇక్కడ చూడండి:
షాంఘై గిగా ఫ్యాక్టరీలో రెండు మోడల్స్‌ను మాత్రమే తయారు చేస్తోంది టెస్లా సంస్థ. ఈ రెండూ కూడా ప్రస్తుతం.. సంస్థకు అతి చౌకైన మోడల్స్‌గా ఉన్నాయి. ఇక్కడి సిబ్బందిని, వారి పనితనాన్ని ఇటీవలి కాలంలో అనేకమార్లు మెచ్చుకున్నారు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.
ఇండియాలో కూడా..!
Tesla in India : ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు టెస్లా ప్లాన్ చేస్తోందన్న విషయం తెలిసిందే. ఇండియా కోసం, ప్రత్యేకంగా ఓ ఎలక్ట్రిక్ కారును ఆటోమొబైల్ సంస్థ రూపొందిస్తోందని తెలుస్తోంది. ఇది.. సంస్థ చరిత్రలోనే అతి చౌకైన కారుగా నిలుస్తుందని సమచారం.
ఇండియాలో పెద్ద ఈవీ మేన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా గత కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తోంది. ఈ విషయంపై.. టెస్లా బృందం, భారత కేంద్రమంత్రి పీయుష్ గోయల్‌తో భేటీ అవుతుందని సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే.. భేటీ తర్వాత ఓ కీలక అప్డేట్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.