తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus 12r : వన్​ప్లస్​ 12ఆర్​ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ చెక్​ చేశారా? ధర ఎంతంటే..

OnePlus 12R : వన్​ప్లస్​ 12ఆర్​ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ చెక్​ చేశారా? ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

27 January 2024, 6:41 IST

    • OnePlus 12R price in India : ఇండియాలో.. వన్​ప్లస్​ 12ఆర్​ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ బుకింగ్స్​ మొదలయ్యాయి. ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వన్​ప్లస్​ 12ఆర్​ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ చెక్​ చేశారా?
వన్​ప్లస్​ 12ఆర్​ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ చెక్​ చేశారా?

వన్​ప్లస్​ 12ఆర్​ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ చెక్​ చేశారా?

OnePlus 12R launch : వన్​ప్లస్​ 12 ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​ని.. అంతర్జాతీయ మార్కెట్​లో ఇటీవలే లాంచ్​ చేసింది సంస్థ. దానితో పాటు మరో గ్యాడ్జెట్​ని కూడా ప్రకటించింది. దాని పేరు వన్​ప్లస్​ 12ఆర్​. ఇదొక ప్రీమియం స్పెసిఫికేషన్స్​తో కూడిన మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​. ఈ నేపథ్యంలో ఈ వన్​ప్లస్​ కొత్త మొబైల్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

వన్​ప్లస్​ 12ఆర్​ ఫీచర్స్​ ఇవే..!

చైనాలో ఈ నెల తొలినాళ్లల్లో వన్​ప్లస్​ ఏస్​ 3ని లాంచ్​ చేసింది దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ. దాని రీబ్రాండెడ్​ వర్షెన్​ వన్​ప్లస్​ 12ఆర్​ని ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్​లో ప్రకటించింది. ఇది.. వన్​ప్లస్​ 11ఆర్​కి సక్సెసర్​గా వస్తోంది.

డిజైన్​ పరంగా.. ఈ కొత్త స్మార్ట్​ఫోన్​.. వన్​ప్లస్​ 12, వన్​ప్లస్​ 11ఆర్​ని పోలి ఉంది. కానీ ఒక మార్పు కనిపిస్తోంది. అలర్ట్​ స్లైడర్​ అనేది.. ఎడమవైపు కనిపిస్తోంది. ఇన్​స్క్రీన్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​ వస్తోంది.

OnePlus 12R features : ఈ వన్​ప్లస్​ 12ఆర్​లో కర్వ్​డ్​ ఎడ్జ్​లు, సెంటర్​ అలైన్డ్​ పంచ్​ హోల్​ కటౌట్​ ఉంటుంది. 6.78 ఇంచ్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే వస్తోంది. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, 1.5కే రిసొల్యూషన్​, 4500 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ దీని సొంతం. గొరిల్లా గ్లాస్​ విక్టస్​ 2 ప్రొటెక్షన్​ సైతం లభిస్తోంది.

వన్​ప్లస్​ కొత్త స్మార్ట్​ఫోన్​లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్​, 2ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది.

ఇక ఈ వన్​ప్లస్​ 12ఆర్​ గ్యాడ్జెట్​లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 ప్రాసెసర్​ ఉంటుంది. ఫోన్​ని కూల్​ చేసేందుకు హీట్​ డిసిపేషన్​ సిస్టెమ్​ సైతం ఇందులో ఉంది. 5,500 ఎంఏహెచ్​ బ్యాటరీ, 100వాట్​ వయర్డ్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తోంది. బ్యాటరీ హెల్త్​ ఇంజిన్​ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్​ 14 ఓఎస్​ సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది.

వన్​ప్లస్​ 12ఆర్​ ధర ఎంతంటే..

OnePlus 12R pre booking : ప్రీమియం స్పెసిఫికేషన్స్​తో వస్తున్న ఈ వన్​ప్లస్​ 12ఆర్ మిడ్​ రేంజ్​​ స్మార్ట్​ఫోన్​ 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ ధర రూ. 39,999గా ఉంది. 16జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ ధర రూ. 45,999గా ఉంది. ఐరన్​ గ్రే, కోల్​ బ్లూ కలర్స్​లో అందుబాటులోకి వచ్చింది.

ఈ మొబైల్​ ప్రీ-ఆర్డర్స్​ ఇప్పటికే మొదలయ్యాయి. ఫిబ్రవరి 6న ఈ వన్​ప్లస్​ 12ఆర్​ సేల్స్​ మొదలవుతాయి. ఇండియాలో ఈ మొబైల్​పై అనేక డిస్కౌంట్స్​, ఆఫర్స్​ కూడా లభిస్తున్నాయి.

తదుపరి వ్యాసం