తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Ace 3 : వన్​ప్లస్​ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​.. ఏస్​ 3 ఫీచర్స్​ చూశారా?

OnePlus Ace 3 : వన్​ప్లస్​ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​.. ఏస్​ 3 ఫీచర్స్​ చూశారా?

Sharath Chitturi HT Telugu

07 January 2024, 17:40 IST

    • OnePlus Ace 3 : వన్​ప్లస్​ ఏస్​ 3 స్మార్ట్​ఫోన్​.. త్వరలోనే ఇండియాలో లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
వన్​ప్లస్​ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​.. ఏస్​ 3 ఫీచర్స్​ చూశారా?
వన్​ప్లస్​ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​.. ఏస్​ 3 ఫీచర్స్​ చూశారా?

వన్​ప్లస్​ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​.. ఏస్​ 3 ఫీచర్స్​ చూశారా?

OnePlus Ace 3 : వన్​ప్లస్​ సంస్థ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​ ఇటీవలే చైనా మార్కెట్​లో లాంచ్​ అయ్యింది. దీని పేరు వన్​ప్లస్​ ఏస్​ 3. ఈ నేపథ్యంలో ఈ కొత్త గ్యాడ్జెట్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

వన్​ప్లస్​ ఏస్​ 3 ఫీచర్స్​ ఇవే..

వన్​ప్లస్​ ఏస్​ 3లో ఫ్రాస్టెడ్​ గ్లాస్​ బ్యాక్​తో కూడిన అల్యుమీనియం ఫ్రేమ్​ ఉంటుంది. ఇందులో 3 స్టేజ్​ అలర్ట్​ స్లైడర్​ ఎడమవైపు ఉంది. గోల్డ్​, కూల్​ బ్లూ, ఐరన్​ గ్రే కలర్స్​లో ఈ స్మార్ట్​ఫోన్​ అందుబాటులో ఉండనుంది.

ఈ వన్​ప్లస్​ ఏస్​ 3 స్మార్ట్​ఫోన్​లో 120 హెచ్​జెడ్​తో కూడిన 6.78 ఇంచ్​ 1.5కే బీఓఈ ఎక్స్​1 అమోలెడ్​ కర్వ్​డ్​ ఎడ్జ్​ డిస్​ప్లే ఉది. ఇక ఈ మొబైల్​కి కార్నరింగ్​ గొరిల్లా గ్లాస్​ విక్టస్​ 2 ప్రొటెక్షన్​ లభిస్తోంది.

OnePlus Ace 3 India launch : వన్​ప్లస్​ కొత్త స్మార్ట్​ఫోన్​ రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్​, 2ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన కెమెరా సెటప్​ వస్తోంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఫ్రెంట్​లో 16ఎంపీ కెమెరా లభిస్తోంది.

ఈ మొబైల్​లో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 ప్రాసెసర్​ ఉంటుంది. 5,500ఎంఏహెచ్​ బ్యాటరీ, 100వాట్​ సూపర్​వీఓఓసీ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తోంది. అంటే.. 0-100శాతం ఛార్జింగ్​ కేవలం 27 నిమిషాల్లో పూర్తవుతుంది. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత కలర్​ఓఎస్​ 14 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది.

వన్​ప్లస్​ ఏస్​ 3 ధర ఎంతంటే..

OnePlus Ace 3 price in India : వన్​ప్లస్​ ఏస్​ 3 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​​ ధర 2,599 యువాన్​లు. అంటే సుమారు రూ. 30వేలు. 16జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ వేరియంట్ 2,999 యువాన్​లు. అంటే సుమారు రూ. 35వేలు. ఇక 16జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర 3,499 యువాన్​లు. అంటే సుమారు రూ. 41,000.

ఇక చైనాలో ఈ మోడల్​ సేల్స్​ జనవరి 8న ప్రారంభమవుతాయి. ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్​లో.. ఈ వన్​ప్లస్​ ఏస్​ 3.. ఈ నెల 23న లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

తదుపరి వ్యాసం