తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Ace 3v : వన్​ప్లస్​ ఏస్​ 3వీ కీలక స్పెసిఫికేషన్స్​ లీక్​..!

OnePlus Ace 3V : వన్​ప్లస్​ ఏస్​ 3వీ కీలక స్పెసిఫికేషన్స్​ లీక్​..!

Sharath Chitturi HT Telugu

25 December 2023, 12:50 IST

    • OnePlus Ace 3V : వన్​ప్లస్​ సంస్థ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​ రాబోతోంది. దీని పేరు వన్​ప్లస్​ ఏస్​ 3వీ. ఈ మోడల్​ స్పెసిఫికేషన్స్​ లీక్​ అయ్యాయి. ఆ వివరాలు..
వన్​ప్లస్​ ఏస్​ 3వీ స్పెసిఫికేషన్స్​ లీక్​..
వన్​ప్లస్​ ఏస్​ 3వీ స్పెసిఫికేషన్స్​ లీక్​..

వన్​ప్లస్​ ఏస్​ 3వీ స్పెసిఫికేషన్స్​ లీక్​..

OnePlus Ace 3V : వన్​ప్లస్​ సంస్థ ఓ కొత్త స్మార్ట్​ఫోన్​ను తయారు చేస్తోంది. దీని పేరు వన్​ప్లస్​ ఏస్​ 3వీ. ఇది.. వన్​ప్లస్​ ఏస్​ 2వీకి సక్సెసర్​గా మార్కెట్​లోకి అడుగుపెడుతుందని సమాచారం. అయితే.. ఈ మొబైల్​కి సంబంధించిన కీలక ఫీచర్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

వన్​ప్లస్​ ఏస్​ 3వీ ఫీచర్స్​ ఇవే..?

చైనాకు చెందిన విబో సోషల్​ మీడియాలో ఈ వన్​ప్లస్​ కొత్త స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ లీక్​ అయ్యాయి. ఈ డేటా ప్రకారం.. ఈ గ్యాడ్జెట్​లో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 7 జెన్​ 3 ప్రాసెసర్​ ఉంటుంది. 1.5కే రిసొల్యూషన్​తో కూడిన స్క్రీన్​ లభిస్తుంది. చైనాలో ఈ మోడల్​ ధర 2000 యువాన్​లుగా ఉండొచ్చు. అంటే.. ఇండియన్​ కరెన్సీ ప్రకారం అది సుమారు రూ. 23,500! అంటే.. మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​గా ఈ వన్​ప్లస్​ ఏస్​ 3వీ మార్కెట్​లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

OnePlus Ace 3V price : ఈ మోడల్​.. వచ్చే ఏడాది చైనాలో లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత.. ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్​లో సైతం రిలీజ్​ అవుతుంది.

ఇదీ చూడండి:- Jio New Year offer : న్యూ ఇయర్​ వేళ జియో అదిరిపోయే ఆఫర్​- మీకు యూజ్​ అవుతుంది చూడండి..

అయితే.. 'ఏస్​' బ్రాండింగ్​తో వస్తున్న స్మార్ట్​ఫోన్స్​ని.. పేరు మార్చి అంతర్జాతీయ మార్కెట్​లో విక్రయిస్తోంది వన్​ప్లస్​ సంస్థ. చైనాలో.. ఈ ఏడాది తొలినాళ్లల్లో లాంచ్​ అయిన వన్​ప్లస్​ ఏస్​ 2వీని.. వన్​ప్లస్​ నార్డ్​ 3గా తీసుకొచ్చింది. ఇందులో డైమెన్సిటీ 9000 ప్రాసెసర్​ ఉంటుంది. ఈ మోడల్​కి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వన్​ప్లస్​ ఏస్​ 3వీకి కూడా మంచి స్పందన లభిస్తోందని సంస్థ చెబుతోంది.

OnePlus Ace 3V price in India : ఇక ఈ వన్​ప్లస్​ ఏస్​ 3వీ గ్యాడ్జెట్​కు సంబంధించిన ఇతర వివరాలపై క్లారిటీ లేదు. లాంచ్​ డేటాపైనా స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే వీటిపై ఓ క్లారిటీ వస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

తదుపరి వ్యాసం