OnePlus Nord Buds 2r : వన్​ప్లస్​ నార్డ్​ బడ్స్​ 2ఆర్​ ధర, ఫీచర్స్​ లీక్​..!-oneplus nord buds 2r pricing and features tipped ahead of july 5 launch ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Nord Buds 2r : వన్​ప్లస్​ నార్డ్​ బడ్స్​ 2ఆర్​ ధర, ఫీచర్స్​ లీక్​..!

OnePlus Nord Buds 2r : వన్​ప్లస్​ నార్డ్​ బడ్స్​ 2ఆర్​ ధర, ఫీచర్స్​ లీక్​..!

Sharath Chitturi HT Telugu
Jun 25, 2023 11:15 AM IST

OnePlus Nord Buds 2r : వన్​ప్లస్​ నుంచి త్వరలోనే నార్డ్​ బడ్స్​ 2ఆర్ లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ధర, ఫీచర్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి.

వన్​ప్లస్​ నార్డ్​ బడ్స్​ 2ఆర్​ ధర, ఫీచర్స్​ లీక్​..!
వన్​ప్లస్​ నార్డ్​ బడ్స్​ 2ఆర్​ ధర, ఫీచర్స్​ లీక్​..! (Amazon)

OnePlus Nord Buds 2r price : నార్డ్​ బడ్స్​ 2ఆర్​ ఇయర్​ఫోన్స్​ను జులై 5న ఇండియాలో లాంచ్​ చేయనుంది వన్​ప్లస్​ సంస్థ. లాంచ్​కు ముందే ఈ ఇయర్​బడ్స్​ లుక్​ను రివీల్​ చేసింది. ఇక ఇప్పుడు ఈ గ్యాడ్జెట్​కు సంబంధించిన ఫీచర్స్​, ధర వంటి వివరాలు లీక్​ అయ్యాయి. వాటిని చూద్దాము..

ధర ఎంతంటే..

పలు లీక్స్​ ప్రకారం.. వన్​ప్లస్​ నార్డ్ బడ్స్​​ 2ఆర్​ బాక్స్​ ప్రైజ్​ రూ. 2,999గా ఉంటుంది. అంటే వీటి రీటైల్​ ధర రూ. 2,999 కన్నా తక్కువగానే ఉండొచ్చు. వీటిలో 12.4 ఎంఎం డ్రైవర్స్​ ఉంటాయి. ఇవి ఆడియో క్వాలిటీని మెరుగుపరుస్తాయి. 3 ఈక్విలైజర్​ ప్రొఫైల్స్​ కూడా లభించొచ్చు. ఐపీ55 రేటింగ్​తో కాడిన వాటర్​, డస్ట్​ రెసిస్టెన్స్​ సపోర్ట్​ లభించే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 38 గంటల పాటు ప్లేబ్యాక్​ టైమ్​ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఉన్న నార్డ్​ బడ్స్​ 2లో 12.4ఎంఎం డైనమిక్​ టిటానియం డ్రైవర్​, 25డీబీ నాయిస్​ కాన్సిలింగ్​, 36 గంటల బ్యాటరీ లైఫ్​, ఐపీ55 స్వెట్​, డస్ట్​ రెసిస్టెన్స్​ వంటివి ఉన్నాయి.

ఇదీ చూడండి:- OnePlus Pad vs Xiaomi Pad 6 Pro : వన్​ప్లస్​ ప్యాడ్​ వర్సెస్​ షావోమీ ప్యాడ్​ 6 ప్రో- ఏది బెస్ట్​?

బోట్ ఎయిర్‌డోప్స్ జెనెసిస్ ఇయర్‌బడ్స్..

ఎయిర్‌డోప్స్ లైనప్‍లో దేశీయ బ్రాండ్ బోట్ మరో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ఇటీవలే లాంచ్​ చేసింది. దీని పేరు బోట్ ఎయిర్‌డోప్స్ జెనెసిస్. డిజైన్ పరంగా కాస్త విభిన్నంగా ఉన్న చార్జింగ్ కేస్‍తో ఈ బడ్స్ అడుగుపెట్టాయి. మెటల్ ఫినిష్, కాంపాక్ట్ డిజైన్‍తో ఇన్నాయి. కాల్ క్వాలిటీ మెరుగ్గా ఉండేందుకు బోట్ ఎయిర్‌డోప్స్ జెనెసిస్ బడ్స్ నాలుగు మైక్‍లను కలిగి ఉన్నాయి.

13ఎంఎం సౌండ్ డ్రైవర్లు ఈ బోట్ ఎయిర్‌డోప్స్ జెనెసిస్ బడ్స్‌లో ఉన్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3 వెర్షన్‍తో ఈ బడ్స్ వచ్చాయి. క్లియర్ కాలింగ్ కోసం ఈఎన్​ఎక్స్​ టెక్నాలజీతో కూడిన నాలుగు మైక్‍లు ఈ బడ్స్‌కు ఉంటాయి.

బోట్ ఎయిర్‌డోప్స్ జెనెసిస్ ఒక్కో బడ్‍లో 35ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్ కేస్‍లో 400ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఫుల్ చార్జ్‌పై చార్జింగ్ కేస్‍తో కలిపి మొత్తంగా ఈ బడ్స్ 54 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఇస్తాయి. 5 నిమిషాల చార్జింగ్‍తోనే 60 నిమిషాలు ఉపయోగించుకునేలా ఏఎస్ఎఏపీ ఫాస్ట్ చార్జింగ్ కూడా ఉంటుంది.

బోట్ ఎయిర్‌డోప్స్ జెనెసిస్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ధర రూ.1,799గా ఉంది. జూన్ 1వ తేదీన అమెజాన్, బోట్ అఫీషియల్ వెబ్‍సైట్‍లో ఈ బడ్స్ సేల్‍కు వస్తాయి. యాక్టివ్ బ్లాక్, వైట్ ప్యూరిటీ, ఓసియానా కలర్ ఆప్షన్‍లలో ఈ బడ్స్ అందుబాటులోకి వస్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం