OnePlus Pad vs Xiaomi Pad 6 Pro : వన్​ప్లస్​ ప్యాడ్​ వర్సెస్​ షావోమీ ప్యాడ్​ 6 ప్రో- ఏది బెస్ట్​?-oneplus pad vs xiaomi pad 6 pro which is better see detailed comparison of price and features here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Pad Vs Xiaomi Pad 6 Pro : వన్​ప్లస్​ ప్యాడ్​ వర్సెస్​ షావోమీ ప్యాడ్​ 6 ప్రో- ఏది బెస్ట్​?

OnePlus Pad vs Xiaomi Pad 6 Pro : వన్​ప్లస్​ ప్యాడ్​ వర్సెస్​ షావోమీ ప్యాడ్​ 6 ప్రో- ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
May 08, 2023 10:25 AM IST

OnePlus Pad vs Xiaomi Pad 6 Pro : వన్​ప్లస్​ ప్యాడ్​, షావోమీ ప్యాడ్​ 6 ప్రో గ్యాడ్జెట్స్​లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? ఇక్కడ తెలుసుకోండి..

వన్​ప్లస్​ ప్యాడ్​ వర్సెస్​ షావోమీ ప్యాడ్​ 6 ప్రో..
వన్​ప్లస్​ ప్యాడ్​ వర్సెస్​ షావోమీ ప్యాడ్​ 6 ప్రో..

OnePlus Pad vs Xiaomi Pad 6 Pro : ట్యాబ్లెట్​ సెగ్మెంట్​లో వన్​ప్లస్​ ప్యాడ్​ ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. ఈ ప్యాడ్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. షావోమీ ప్యాడ్​ 6 ప్రోతో ఈ వన్​ప్లస్​ ప్యాడ్​ను పోల్చి.. ఈ రెండిట్లో ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

వన్​ప్లస్​ ప్యాడ్​ వర్సెస్​ షావోమీ ప్యాడ్​ 6 ప్రో- స్పెసిఫికేషన్స్​..

ఈ రెండు ప్యాడ్స్​లో మెటల్​ బాడీ, టాప్​ సెంటర్డ్​ పంచ్​ హోల్​ కటౌట్​తో పాటు స్టైలస్​ పెన్​, కీబోర్డు సపోర్ట్​ లభిస్తోంది. ఈ రెండు కూడా డాల్బి విజన్​కు సపోర్ట్​ చేస్తాయి.

OnePlus Pad review : వన్​ప్లస్​ ప్యాడ్​లో 144 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 11.6 ఇంచ్​ 2.8 కే (2000x2800 పిక్సెల్స్​) ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. షావోమీ ప్యాడ్​ 6 ప్రోలో 144 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 11 ఇంచ్​ 2.8కే (1800x2880 పిక్సెల్స్​) ఎల్​సీడీ స్క్రీన్​ వస్తోంది. ఈ గ్యాడ్జెట్​కు గొరిల్లా గ్లాస్​ 3 ప్రొటెక్షన్​ లభిస్తోంది.

వన్​ప్లస్​ ప్యాడ్​ వర్సెస్​ షావోమీ ప్యాడ్​ 6 ప్రో- ఫీచర్స్​..

వన్​ప్లస్​ ప్యాడ్​లో 13ఎంపీ సింగల్​ రేర్​ కెమెరా విత్​ ఎల్​ఈడీ ఫ్లాష్​ ఉంది. సెల్ఫీ కోసం 8ఎంపీ కెమెరా ఇచ్చింది వన్​ప్లస్​. ఇందులో డైమెన్సిటీ 9000 ప్రాసెసర్​ చిప్​సెట్​ ఉంటుంది. 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ దీని సొంతం. ఇందులో 9,510ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండటం విశేషం.

ఇదీ చదవండి- OnePlus Pad vs Samsung Galaxy Tab S8 : ఈ రెండు ట్యాబ్స్​లో ఏది బెస్ట్​..?

Xiaomi Pad 6 Pro release date in India : ఇక షావోమీ ప్యాడ్​ 6 ప్రోలో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకెండర్​ కెమెరా విత్​ ఎల్​ఈడీ ఫ్లాష్​ ఉంటుంది. సెల్ఫీ కోసం 20ఎంపీ కెమెరా లభిస్తుండటం విశేషం. ఇందులో స్నాప్​డ్రాగన్​ 8+ జెన్​ 1 ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉంటుంది. 8,600 ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం.

ఈ రెండూ కూడా రేర్​ కెమెరాతో 4క వీడియోలు చిత్రించగలవు.

వన్​ప్లస్​ ప్యాడ్​ వర్సెస్​ షావోమీ ప్యాడ్​ 6 ప్రో- కనెక్టివిటీ..

OnePlus Pad specifications : వన్​ప్లస ప్యాడ్​లో ఓమ్నీబేరింగ్​ సౌండ్​ ఫీల్డ్​ టెక్నాలజీ, డాల్బీ అట్మోస్​తో కూడిన క్వాడ్​ స్పీకర్స్​ ఉన్నాయి. వైఫై 6, బ్లూటూత్​ 5.3 వంటివి వస్తున్నాయి. టైప్​-సీ ఛార్జర్​ ఉంటుంది.

షావోమీ ప్యాడ్​ 6 ప్రోలో డాల్బీ అట్మోస్​ సపోర్ట్​తో 4 స్పీకర్స్​ ఉంటాయి. వైఫై-6, బ్లూటూత్​ 5.3 వంటివి ఉన్నాయి. టైప్​ సీ ఛార్జర్​తో ఛార్జ్​ చేసుకోవాలి.

వన్​ప్లస్​ ప్యాడ్​ వర్సెస్​ షావోమీ ప్యాడ్​ 6 ప్రో- ధర..

OnePlus Pad price in India : వన్​ప్లస్​ ప్యాడ్​ 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ ధర రూ. 37,999గా ఉంది. 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 39,999గా ఉంది. హాలో గ్రీన్​ రంగులో అందుబాటులో ఉంటుంది.

Xiaomi Pad 6 Pro price in India : ఇక షావోమీ ప్యాడ్​ 6 ప్రో ధర చైనాలో సుమారు రూ. 29,550 (8జీబీ- 128జీబీ), రూ. 40,200 (12జీబీ- 512జీబీ)గా ఉంది. బ్లాక్​, గోల్డ్​, మౌంటైన్​ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇది ఇండియా మార్కెట్​లోనూ లాంచ్​ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం