OnePlus 9 5G : 5 జీ ఫోన్ వన్ ప్లస్ 9 పై భారీ డిస్కౌంట్.. ఎక్కడో తెలుసా?-oneplus 9 5g available at discount of rs 12 000 where to get ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus 9 5g : 5 జీ ఫోన్ వన్ ప్లస్ 9 పై భారీ డిస్కౌంట్.. ఎక్కడో తెలుసా?

OnePlus 9 5G : 5 జీ ఫోన్ వన్ ప్లస్ 9 పై భారీ డిస్కౌంట్.. ఎక్కడో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Apr 04, 2023 04:58 PM IST

OnePlus 9 5G : చైనా దిగ్గజ స్మార్ట్ ఫోన్ మ్యాన్యుఫాక్చరర్ వన్ ప్లస్ (OnePlus) ప్రీమియం మోడల్ వన్ ప్లస్ 9 (OnePlus 9) భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఇంతవరకు ఇంత పెద్ద మొత్తంలో డిస్కౌంట్ లభించడం ఇదే ప్రథమం.

OnePlus 9 5G
OnePlus 9 5G

వన్ ప్లస్ 9 ప్రీమియం ఫోన్ (OnePlus 9) 5 జీ ని సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్ (12 GB RAM), 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (256 GB internal storage) తో వస్తోంది. ఈ మోడల్ పై వన్ ప్లస్ భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది.

OnePlus 9 5G: వన్ ప్లస్ అఫిషియల్ ఆన్ లైన్ స్టోర్ లో..

వన్ ప్లస్ 9 5 జీ (OnePlus 9 5G) మోడల్ ఫోన్ పై తమ అధికారిక వెబ్ సైట్ లో వన్ ప్లస్ ఈ డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. కొనుగోలు దారులకు మొత్తంగా 22% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. వన్ ప్లస్ 9 5 జీ (OnePlus 9 5G) 12 జీబీ ర్యామ్ (12 GB RAM), 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (256 GB internal storage) మోడల్ ఎమ్మార్పీ రూ. 54,999 కాగా, వన్ ప్లస్ వెబ్ సైట్లో అది రూ. 42,999 కి లభిస్తుంది. అంటే సుమారు 21.81% డిస్కౌంట్ తో లభిస్తుంది. కొనుగోలుదారులు మొబిక్విక్ వాలెట్ (MobiKwik wallet) ద్వారా చెల్లిస్తే, అదనంగా మరో రూ. 2 వేల డిస్కౌంట్ లభిస్తుంది. ఇందుకోసం MBK2000 ప్రొమో కోడ్ ను ఉపయోగించాలి. అంటే, మొబిక్విక్ ద్వారా వన్ ప్లస్ వెబ్ సైట్లో ఈ ప్రీమియం ఫోన్ రూ. 40,999 కి లభిస్తుంది. అంటే, 14 వేల డిస్కౌంట్ తో ఈ OnePlus 9 5G ఫోన్ ను పొందవచ్చు. ఇతర ఆఫర్లు, ఎక్స్ చేంజ్ బెనిఫిట్స్ అదనం. అలాగే, ఈ ప్రీమియం ఫోన్ కొనుగోలుతో పాటు మ్యూజిక్ యాప్ స్పాటిఫై ఆరు నెలల సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

OnePlus 9 5G Features: వన్ ప్లస్ 9 5 జీ ఫీచర్లు

వన్ ప్లస్ 9 5 జీ (OnePlus 9 5G) ఫోన్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ను అమర్చారు. 2,400*1,800 పిక్సెల్ రెజొల్యూషన్ తో 6.57-inch అమొలెడ్ (AMOLED) డిస్ ప్లే ను పొందుపర్చారు. అలాగే, కార్నెల్ గొరిలా గ్లాస్ తో స్క్రీన్ ప్రొటెక్షన్ అందించారు. వన్ ప్లస్ 9 5 జీ (OnePlus 9 5G) ఫోన్ లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని, ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 ఎంపీ కెమెరాను అమర్చారు. వెనుకవైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, 2ఎంపీ మోనో క్రోమ్ సెన్సర్ లను అమర్చారు.