OnePlus Nord CE 3 Lite 5G launch: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ లాంచ్ నేడే.. టీడబ్ల్యూఎస్ కూడా: టైమ్ సహా మరిన్ని వివరాలు
OnePlus Nord CE 3 Lite 5G launch event: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ నేడు (ఏప్రిల్ 4) విడుదల కానుంది. ఈ ఈవెంట్ టైమ్, లైవ్ స్ట్రీమింగ్, స్పెసిఫికేషన్లు సహా మరిన్ని వివరాలపై ఓ లుక్కేయండి.
OnePlus Nord CE 3 Lite 5G launch event: వన్‍ప్లస్ నార్డ్ లాంచ్ ఈవెంట్ నేడు (ఏప్రిల్ 4) జరగనుంది. వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ (OnePlus Nord CE 3 Lite 5G) ఫోన్‍తో పాటు వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 (OnePlus Nord Buds 2) టీడబ్ల్యూఎస్ ఈ ఈవెంట్ ద్వారా భారత మార్కెట్‍లో విడుదల కానున్నాయి. నార్డ్ సీఈ 2 లైట్ 5జీకి సక్సెసర్‌గా నార్డ్ సీఈ 3 లైట్ 5జీ వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్‍కు సంబంధించిన చాలా వివరాలు బయటికి వచ్చాయి. రూ.25వేలలోపు ధరలోనే నార్డ్ సీఈ 3 లైట్ 5జీ మొబైల్ ఉంటుందని ఖరారైంది. ఈ లాంచ్ ఈవెంట్ టైమ్, లైవ్ స్ట్రీమింగ్, వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్‍కు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి.
వన్‍ప్లస్ నార్డ్ లాంచ్ ఈవెంట్ టైమ్
OnePlus Nord launch event Time, Live Streaming: వన్‍ప్లస్ నార్డ్ లాంచ్ ఈవెంట్ నేటి (ఏప్రిల్ 4) సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ లాంచ్ ఈవెంట్ వన్‍ప్లస్ ఇండియా అఫీషియల్ యూట్యూబ్ చానెల్‍లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. సాయంత్రం 7 గంటలకు లైవ్ మొదలవుతుంది. కింద ఎంబెడ్ చేసిన వీడియో ద్వారా కూడా లైవ్ స్ట్రీమ్ చూడవచ్చు.
ఈ లాంచ్ ఈవెంట్‍లో వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీతో పాటు వన్‍ప్లస్ నార్డ్ బడ్స్ 2 టీడబ్ల్యూఎస్ కూడా విడుదల అవుతుంది.
OnePlus Nord CE 3 Lite 5G: 6.72 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ IPS LCD డిస్‍ప్లేతో వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ రానుంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్ ఈ మొబైల్‍లో ఉంటుంది. వెనుక మూడు కెమెరాలు ఉండనుండగా.. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ వన్‍ప్లస్ బడ్జెట్ ఫోన్ రానుంది.
వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍తో అడుగుపెడుతోంది.
OnePlus Nord CE 3 lite 5G Price: వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ రెండు వేరియంట్లలో ఇండియాలో విడుదల కానుందని అంచనాలు ఉన్నాయి. 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉండే బేస్ వేరియంట్ ధర రూ.21,999గా ఉంటుందని ఇటీవల లీకుల ద్వారా వెల్లడైంది. టాప్ వేరియంట్ ధర రూ.23,999గా ఉంటుందని తెలుస్తోంది. అయితే, నేటి లాంచ్ ఈవెంట్‍లో ఈ ఫోన్ అధికారిక ధరను, పూర్తి వివరాలను వన్‍ప్లస్ వెల్లడిస్తుంది. ఫస్ట్ సేల్ సందర్భంగా ఆఫర్లు కూడా ఉంటాయి.