OnePlus Pad vs Samsung Galaxy Tab S8 : ఈ రెండు ట్యాబ్స్​లో ఏది బెస్ట్​..?-oneplus pad vs samsung galaxy tab s8 check price specifications and other detailed comparison ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Pad Vs Samsung Galaxy Tab S8 : ఈ రెండు ట్యాబ్స్​లో ఏది బెస్ట్​..?

OnePlus Pad vs Samsung Galaxy Tab S8 : ఈ రెండు ట్యాబ్స్​లో ఏది బెస్ట్​..?

Sharath Chitturi HT Telugu
Apr 03, 2023 10:20 AM IST

OnePlus Pad vs Samsung Galaxy Tab S8 : వన్​ప్లస్​ ప్యాడ్​ ప్రీ-బుకింగ్స్​ త్వరలోనే ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్యాడ్​ను.. శాంసంగ్​ గ్యాలెక్సీ ట్యాబ్​ ఎస్​8తో పోల్చి, రెండింట్లో ఏది బెస్ట్​? అన్నది తెలుసుకుందాము..

ఈ రెండు ట్యాబ్స్​లో ఏది బెస్ట్​..?
ఈ రెండు ట్యాబ్స్​లో ఏది బెస్ట్​..?

OnePlus Pad vs Samsung Galaxy Tab S8 : మార్కెట్​లో ఇప్పుడు చాలా ట్యాబ్స్​ అందుబాటులో ఉన్నాయి. వీటికి డిమాండ్​ కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోనే.. ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ వన్​ప్లస్​.. ఇటీవలే ఓ ప్యాడ్​ను లాంచ్​ చేసింది. అదే వన్​ప్లస్​ ప్యాడ్​. ఈ మోడల్​.. శాంసంగ్​ గ్యాలెక్సీ ట్యాబ్​ ఎస్​8కు పోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది కొంటే బెటర్​ అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

వన్​ప్లస్​ ప్యాడ్​ వర్సెస్​ శాంసంగ్​ గ్యాలెక్సీ ట్యాబ్​ ఎస్​8- స్పెసిఫికేషన్స్​..

OnePlus Pad price : వన్​ప్లస్​ ప్యాడ్​, గ్యాలెక్సీ ట్యాబ్​ ఎస్​8లో మెటల్​ బాడీ, టాప్​- సెంటర్డ్​ కెమెరా, స్టైలస్​ పెన్​ సపోర్ట్​, కీబోర్డ్​ ఉన్నాయి. వన్​ప్లస్​ ప్యాడ్​లో 11.6 ఇంచ్​ 2.8కే ఎల్​సీడీ స్క్రీన్​ (144హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​), 7:5 ఆస్పెక్ట్​ రేషియో, డాల్బీ విజన్​ వంటివి ఉన్నాయి.

ఇక గ్యాలెక్సీ ట్యాబ్​ ఎస్​8లో 11.0 ఇంచ్​ డబ్ల్యూక్యూఎక్స్​జీఏ ఎల్​టీపీఎస్​ టీఎఫ్​టీ డిస్​ప్లే (120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​) గొరిల్లా గ్లాస్​ 5 ప్రొటక్షన్​ వంటివి లభిస్తున్నాయి.

వన్​ప్లస్​ ప్యాడ్​ వర్సెస్​ శాంసంగ్​ గ్యాలెక్సీ ట్యాబ్​ ఎస్​8- ఫీచర్స్​..

వన్​ప్లస్​ ప్యాడ్​లో 13ఎంపీ సింగిల్​ రేర్​ కెమెరా, ఎల్​ఈడీ ఫ్లాష్​ లైట్​ లభిస్తున్నాయి. ఇక ఫ్రెంట్​లో సెల్ఫీ కోసం 8ఎంపీ కెమెరా వస్తోంది. డైమెన్సిటీ 9000 ప్రాసెసర్​, 12జీబీ ర్యామ్​/ 256జీబీ స్టోరేజ్​, 9500 ఎంఏహెచ్​ బ్యాటరీ, 67వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ వంటివి ఇందులోని మరిన్ని ఫీచర్స్​. ఈ ప్యాడ్​లో​ ఆండ్రాయిడ్​ 13 ఓఎస్​ ఉంటుంది.

Samsung Galaxy Tab S8 features : మరోవైపు గ్యాలెక్సీ ట్యాబ్​ ఎస్​8లో డ్యూయెల్​ రేర్​ (13ఎంపీ, 6ఎంపీ) కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ కోసం 12ఎంపీ కెమెరా వస్తోంది. ఈ ట్యాబ్​ 4కే వీడియోలను 30ఎఫ్​పీఎస్​లో షూట్​ చేయగలదు. గ్యాలెక్సీ ట్యాబ్​ ఎస్​8లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 1 ఎస్​ఓసీ ప్రాసెసర్​, 8జీబీ ర్యామ్​/ 128జీబీ స్టోరేజ్​, 8000ఎంఏహెచ్​ బ్యాటరీ, 45వాట్​ ర్యాపిడ్​ ఛార్జింగ్​ వంటి ఫీచర్స్​ వస్తున్నాయి. ఇందులో ఆండ్రాయిట్​12 ఓఎస్​ ఉంటుంది.

వన్​ప్లస్​ ప్యాడ్​ వర్సెస్​ శాంసంగ్​ గ్యాలెక్సీ ట్యాబ్​ ఎస్​8- కనెక్టివిటీ..

వన్​ప్లస్​ ప్యాడ్​లో ఓమ్నీబేరింగ్​ సౌండ్​ ఫీల్డ్​ టెక్నాలజీతో కూడిన క్వాడ్​ స్పీకర్​ సెటప్​ ఉంటుంది. ఈ మోడల్​ డాల్బీ అట్మోస్​కు సపోర్ట్​ చేస్తుంది. వైఫై-6, బ్లూటూత్​ 5.3 వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ ఉన్నాయి.

ఇక శాంసంగ్​ గ్యాలెక్సీ ట్యాబ్​ ఎస్​8లో డాల్బీ అట్మోస్​ సపోర్ట్​తో కూడిన 4 స్పీకర్లు ఉన్నాయి. నానో సిమ్​ స్లాట్​, వైఫై 6ఈ, బ్లూటూత్​ 5.2, జీపీఎస్​ వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ వస్తున్నాయి. సైడ్​- ఫేసింగ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​ కూడా లభిస్తోంది.

వన్​ప్లస్​ ప్యాడ్​ వర్సెస్​ శాంసంగ్​ గ్యాలెక్సీ ట్యాబ్​ ఎస్​8- ధర..

OnePlus Pad expected price : ఇండియాలో వన్​ప్లస్​ ప్యాడ్​ ప్రీ- బుకింగ్స్​ ఈ నెల 28న ప్రారంభమవుతాయి. ఇండియా మార్కెట్​ల దీని ధర రూ. 40వేలుగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

Samsung Galaxy Tab S8 price : ఇక శాంసంగ్​ గ్యాలెక్సీ ట్యాబ్​ ఎస్​8 వైఫై వేరియంట్​ ధర రూ. 58,999. వైఫై+ 5జీ వేరియంట్​ ధర రూ. 70,999. వివిధ ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ స్టోర్స్​లో ఈ ట్యాబ్​ సేల్స్​కు అందుబాటులో ఉంది.

సంబంధిత కథనం