Best laptops for coding : కోడింగ్, ప్రోగ్రామింగ్ కోసం ఈ ల్యాప్టాప్స్ బెస్ట్!
16 February 2024, 12:10 IST
- Best laptops for coding and programming : కోడింగ్ కోసం మంచి ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. బడ్జెట్ రేంజ్ నుంచి ప్రీమియం ల్యాప్టాప్స్ వరకు.. మీకు ఉపయోగపడే ల్యాప్టాప్స్ లిస్ట్‌ని ఇక్కడ చూడండి..
కోడింగ్, ప్రోగ్రామింగ్ కోసం ఈ ల్యాప్టాప్స్ బెస్ట్!
Best laptops for coding in India 2024 : ఐటీ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారా? లేక కోడింగ్, ప్రోగ్రామింగ్ కోర్సులో చేరారా? మంచి ల్యాప్‌టాప్ కోసం వెతుకుతున్నారా? అయితే.. ఇది మీకోసమే. కోడింగ్, ప్రోగ్రామింగ్‌కి ఉపయోగపడే బెస్ట్ ల్యాప్టాప్స్ లిస్ట్‌ని మీకోసం మేము రూపొందించాము. ఆ లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..
కోడింగ్, ప్రోగ్రామింగ్ కోసం బెస్ట్ ల్యాప్టాప్స్ ఇవే..
యాపిల్ మాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్ ఎం1 చిప్:- ఈ ల్యాప్‌టాప్ డిజైన్ స్లిమ్‌గా ఉంటుంది. రెటినా డిస్ప్లే వస్తోంది. 8జీబీ ర్యామ్, 256జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ లభిస్తోంది. ఫేస్‌టైమ్ హెచ్డీ కెమెరా, టచ్ ఐడీ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇది ఎనర్జీ ఎఫీషియెంట్ కూడా! అమెజాన్‌లో ల్యాప్‌టాప్ ధర రూ. 83,990గా ఉంది.
Asus Vivobook Go 15 : ఏసస్ వివోబుక్ గో 15:- ఈ ఏసస్ ల్యాప్‌టాప్ అటు పర్ఫార్మెన్స్ని, ఇటు ధరని బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో ఏఎండీ రైజెన్ 5 75210యూ, 15.6 ఫుల్హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. డిజైన్ చాలా థిన్‌గా, లైట్‌గా ఉంటుంది. 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ దీని సొంతం. అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 51,530గా ఉంది.
ఇదీ చూడండి:- Motorola Moto G04: 10 వేల లోపు ధరలో, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో మోటో జీ04 స్మార్ట్ ఫోన్..
Best Coding laptops in India : సామ్సంగ్ గెలాక్సీ బుక్3 ప్రో 360:- ఈ సామ్సంగ్ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ 13వ జెనరేషన్ జెన్ ఐ7 ఈవోటీఎం ఉంటుంది. 2 ఇన్ 1 డిజైన్, 3కే టచ్‌స్క్రీన్ దీని సొంతం. బిల్డ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. డిజైన్ థిన్‌గా, లైట్‌గా ఉంటుంది. 1080పీ కెమెరా ఈ మోడల్‌కి ఉంటుంది. ఈ మోడల్ ధర సుమారు రూ. 1.54లక్షలు
డెల్ ఎక్స్పీఎస్ 15:- ఇందులో ఇంటెల్ కోర్ ఐ7- 12700హెచ్ ప్రాసెసర్ ఉంటుంది. 16జీబీ ర్యామ్ 1టీబీ స్టోరేజ్ వేరియంట్ లభిస్తోంది. 15.6 ఇంచ్ స్క్రీన్ వస్తోంది. డిజైన్ చాలా స్లిమ్‌గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ మోడల్ ధర సుమారు రూ. 2.5లక్షలు.
లెనోవా థింక్‌ప్యాడ్ ఎక్స్1 ఎక్స్ట్రీమ్:- ఈ ల్యాప్‌టాప్‌లో 8వ జెనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ఉంటుంది. 64జీబీ ర్యామ్ వరకు సపోర్ట్ లభిస్తుంది. 1టీబీ స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది. 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ స్క్రీన్‌ప్లే దీని సొంతం. అమెజాన్‌లో ఈ మోడల్ ధర సుమారు రూ. 71వేలు.