Motorola Moto G04: 10 వేల లోపు ధరలో, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో మోటో జీ04 స్మార్ట్ ఫోన్..-motorola moto g04 launched in india today check specs price features more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Motorola Moto G04: 10 వేల లోపు ధరలో, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో మోటో జీ04 స్మార్ట్ ఫోన్..

Motorola Moto G04: 10 వేల లోపు ధరలో, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో మోటో జీ04 స్మార్ట్ ఫోన్..

HT Telugu Desk HT Telugu
Feb 15, 2024 03:34 PM IST

Motorola Moto G04: మోటోరోలా సంస్థ భారతీయ మార్కెట్లో మోటో జీ 04 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అత్యాధునిక ఫీచర్స్ తో బడ్జెట్ ఫోన్స్ సెగ్మెంట్లో ఈ ఫోన్ ను మోటోరోలా లాంచ్ చేసింది.

మోటో జీ 04 స్మార్ట్ ఫోన్
మోటో జీ 04 స్మార్ట్ ఫోన్ (Motorola)

Motorola Moto G04: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కీలకమైనది బడ్జెట్ సెగ్మెంట్. వివిధ కంపెనీలు ఈ సెగ్మెంట్లో కొత్త ఆవిష్కరణలు, ఫీచర్లతో ఫోన్స్ ను లాంచ్ చేస్తున్నాయి. రూ.10,000 లోపు సెగ్మెంట్లో మోటోరోలా తన కొత్త మోటో జీ04 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. 90 హెర్ట్జ్ డిస్ ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది. అన్ని లేటెస్ట్ ఫీచర్లు, డిజైన్ తో ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకు వస్తున్నారు.

మోటో జీ04 స్పెసిఫికేషన్లు

మోటో జీ04 (Motorola Moto G04) యాక్రిలిక్ గ్లాస్ ఫినిష్ తో వస్తుంది. ఇది బడ్జెట్ విభాగంలో ప్రీమియం లుక్ ను ఇస్తుంది. మోటో జీ04 స్మార్ట్ ఫోన్ లో 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ పంచ్ హోల్ డిస్ ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 537నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉన్నాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 వెర్షన్ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. ఈ మోటో జి 04 స్మార్ట్ ఫోన్ యునిసోక్ టి 606 చిప్ సెట్ తో పనిచేస్తుంది. స్టోరేజ్ పరంగా, మోటో జి 04 4 జీబీ, 8 జీబీ, 16 జీబీ ర్యామ్ ఆప్షన్స్ తో వస్తుంది. అలాగే, ఇది రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. అవి 64 జీబీ, 128 జీబీ. యుఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ డివైస్ ట్రిపుల్ కార్డ్ స్లాట్స్ ను కలిగి ఉంది. వాటిలో 2 సిమ్ కార్డ్స్ ను, ఒక మైక్రో ఎస్ డీ కార్డ్ ను వాడుకోవచ్చు. స్టోరేజ్ ను 1 టిబి వరకు విస్తరించవచ్చు.

కెమెరా..

ఈ మోటో జీ 04 (Motorola Moto G04) స్మార్ట్ ఫోన్ లో 16 మెగాపిక్సెల్ ఏఐ ఆధారిత కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అధిక-నాణ్యత కోసం హెచ్ డీ ఆర్, పోర్ట్రెయిట్ మోడ్ వంటి స్మార్ట్ ఫీచర్లను కూడా కెమెరా సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

మోటో జి04 ధర

మోటో జి 04 కాంకార్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ, సన్ రైజ్ ఆరెంజ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మోటో జీ04 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999 కాగా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999. ఫ్లిప్ కార్ట్, Motorola.in, రిటైల్ స్టోర్లలో ఫిబ్రవరి 22, 2024 నుంచి మోటో జీ04 సేల్ ప్రారంభం కానుంది.

Whats_app_banner