Tata Technologies IPO : టాటా టెక్నాలజీస్ ఐపీఓ అలాట్ అయితే జాక్‌పాట్ కొట్టినట్టే!
18 November 2023, 13:15 IST
- Tata Technologies IPO : టాటా టెక్నాలజీస్ ఐపీఓ జీఎంపీ దూసుకెళుతోంది. బంపర్ లిస్టింగ్ పక్కా అని జీఎంపీ సూచిస్తోంది.
టాటా టెక్నాలజీస్ ఐపీఓకు బంపర్ లిస్టింగ్ పక్కా?
Tata Technologies IPO : దశాబ్దాల తర్వాత.. టాటా సంస్థ నుంచి ఒక ఐపీఓ వస్తోంది. అదే.. టాటా టెక్నాలజీస్ ఐపీఐ. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఈ నెల 22న ఓపెన్ అవ్వనుంది. ఈ నెల 24 వరకు బిడ్డింగ్ వేసుకోవచ్చు. టాటా టెక్నాలజీస్ ఐపీఓ ప్రైజ్ బ్యాండ్ షేరుకు రూ. 475- రూ. 500గా ఫిక్స్ చేసింది సంస్థ. ఐపీఓ అలాట్ అవ్వాలంటే.. కచ్చితంగా రూ. 500ని కోట్ చేయాలి.
టాటా టెక్నాలజీస్ జీఎంపీ..
మరోవైపు.. సబ్‌స్క్రిప్షన్‌కి ముందు సెకెండరీ మార్కెట్లో టాటా టెక్నాలజీస్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం దూసుకెళుతుంది. శనివారం ఉదయం నాటికి.. జీఎంపీ రూ. 375గా నమోదైంది. శుక్రవారం ఇది రూ. 340గా ఉండేది. అంటే రూ. 35 ఎక్కువ.
Tata Technologies IPO GMP : అంటే.. ప్రస్తుత లెక్కల ప్రకారం లిస్ట్ అయినప్పుడు.. ఈ ఐపీఓ.. రూ. 375 ప్రీమియంతో లిస్ట్ అవుతుందని అర్థం. కాకపోతే, కేవలం జీఎంపీని మాత్రమే చూసి ఐపీఓకు అప్లై చేయకూడదు. సంస్థ ఫండమెంటల్స్‌ని చూసి, భవిష్యత్తులో పెరుగుతుందన్న నమ్మకం ఉంటేనే అప్లై చేయాలని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. లిస్టింగ్ డేట్ సమీపిస్తున్న కొద్ది.. అప్పటి మార్కెట్ సెంటిమెంట్ బట్టి ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అనేది పెరగొచ్చు లేదా తగ్గొచ్చు.
పైన చెప్పినట్టు.. టాటా టెక్నాలజీస్ ఐపీఓ ఇష్యూ ప్రైజ్ షేరుకు రూ. 475- రూ. 500. ఒక లాట్లో 30 షేర్లను అప్లై చేసుకోవచ్చు. ఈ ఐపీఓ ద్వారా.. రూ. 3,042.51 కోట్లను రైజ్ చేస్తోంది సంస్థ. 100శాతం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఐపీఓను తీసుకొస్తోంది. అంతేకాకుండా.. షేర్‌హోల్డర్ కేటగిరీ కూడా ఉంది.
Tata Technologies IPO GMP today : జీఎంపీని చూస్తుంటే.. ఈ ఐపీఓకు భారీ డిమాండ్ ఉంటుందని స్పష్టమవుతోంది. రీటైల్ కేటగిరీ కొన్ని గంటల్లోనే ఫుల్ అయిపోవచ్చు. ఎంత ఎక్కువ మంది అప్లై చేస్తుంటే.. ఐపీఓ అలాట్ అయ్యే అవకాశాలు అంత తక్కువగా ఉంటాయి. అందుకే.. షేర్‌హోల్డర్ కేటగిరీలో అప్లై చేస్తే బెటర్. ఇందుకోసం మీ డీమ్యాట్ అకౌంట్లో ఇప్పటికే ఓ టాటా మోటార్స్ షేరు ఉండి ఉండాలి.
ఈ ఐపీఓకి అప్లై చేసుకోవచ్చా?
"గ్లోబల్ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో టాటా టెక్నాలజీస్ ఒక లీడింగ్ కంపెనీ. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఈ కంపెనీకి డీప్ డొమైన్ ఉంది. ఇదొక ఈఆర్ అండ్‌డీ కంపెనీ. దీని ఫోకస్ ఆటోమోటివ్ ఇండస్ట్రీపైనే ఉంటుంది. ఐపీఓ కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్‌లోనే వస్తోంది. అందుకే ఈ ఐపీఓకు మేము మిడ్ టర్మ్- లాంగ్ టర్మ్ కోసం 'సబ్‌స్క్రైబ్' చేసుకోవాలని సూచిస్తున్నాము," అని బొనాంజ పోర్ట్‌ఫోలియో సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ రాజేశ్ సిన్హా తెలిపారు.