తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Nexon Ev Price Drop: టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ల ధరల తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే

Tata Nexon EV Price Drop: టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ల ధరల తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే

18 January 2023, 13:52 IST

    • Tata Nexon EV Price Drop: టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గాయి. వేరియంట్లను బట్టి రూ.85వేల వరకు ధరలో కోత ఉంది. పూర్తి వివరాలు ఇవే.
Tata Nexon EV Price Drop: టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ల ధరల తగ్గింపు
Tata Nexon EV Price Drop: టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ల ధరల తగ్గింపు

Tata Nexon EV Price Drop: టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ల ధరల తగ్గింపు

Tata Nexon EV Price Drop: ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ విభాగంలో ప్రముఖ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) దూసుకుపోతోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా టాటా నెక్సాన్ ఈవీ చాలా పాపులర్ అయింది. అమ్మకాల్లోనూ ఈ ఎలక్ట్రిక్ కార్లు దుమ్మురేపుతున్నాయి. ఈ నేపథ్యంలో నెక్సాన్ ఈవీ ధరలను టాటా మోటార్స్ సవరించింది. దీంతో ఈ నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గాయి. పీఎల్ఐ స్కీమ్ కారణంగా నెక్సాన్ ఈవీ రేట్లు దిగివచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

WhatsApp design: వాట్సాప్ డిజైన్ పూర్తిగా మారబోతోంది.. కొత్త కలర్స్, కొత్త ఐకన్స్, కొత్త టూల్స్..

Kia car: కస్టమర్ల కోసం లైవ్ కన్సల్టింగ్ సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చిన కియా

Retirement planning: రిటైర్మెంట్ తరువాత జీవితాన్ని హాయిగా గడపాలా? ఈ ‘3 బకెట్ స్ట్రాటెజీ’ని ఫాలో కండి..

Virat Kohli: త్వరలో మార్కెట్లోకి విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన ‘గో డిజిట్’ ఐపీఓ; ఈ ఐపీఓతో కోహ్లీకి కళ్లు చెదిరే లాభం

Tata Nexon EV: కొత్త ధరలు ఇవే

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) ప్రారంభ మోడల్ ధర రూ.50వేలు తగ్గి ప్రస్తుతం రూ.14.49లక్షలకు దిగివచ్చింది. టాప్ వేరియంట్ మ్యాక్స్ ఎక్స్ఎం+ లక్స్ (Tata Nexon EV Max XM+ Lux) వేరియంట్‍ ధర రూ.85,000 వరకు తగ్గింది. ప్రస్తుతం ఈ మోడల్ ధర రూ.18.49వేలకు దిగివచ్చింది. ఇక మిగిలిన వేరియంట్లపై కూడా ధరలు తగ్గాయి. ఇవి ఎక్స్ షో-రూమ్ ధరలు.

Tata Nexon EV Max: మరింత రేంజ్

Tata Nexon EV Max నెక్సాన్ ఈవీ మ్యాక్స్ రేంజ్‍ను టాటా మోటార్స్ అప్‍డేట్ చేసింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 453 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చేలా అప్‍డేట్ అవుతోంది. ఇంత వరకు ఇది 437 కిలోమీటర్లుగా ఉండగా.. దీనికి 16 కిలోమీటర్లు అదనపు రేంజ్ యాడ్ కానుంది. ఇందుకోసం బ్యాటరీని అప్‍డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సాఫ్ట్ వేర్ అప్‍డేట్ సరిపోతుంది. ఇప్పటికే నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కార్లు వాడుతున్న వారు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ అప్‍డేట్ ప్రయోజనాలను పొందవచ్చు.

Tata Nexon EV Max: సరికొత్త ఎక్స్ఎం వేరియంట్

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లైనప్‍లో కొత్త ఎక్స్ఎం వేరియంట్‍ను టాటా మోటార్స్ తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, i-VBACతో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, పుష్ బటన్ స్టార్ట్, డిజిటల్ టీఎఫ్‍టీ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీతో కూడిన జెడ్‍కనెక్ట్ కార్ కనెక్టెడ్ టెక్ లాంటి ఫీచర్లను ఈ నయా ఎక్స్ఎం కలిగి ఉంది. దీని ధర రూ.16.49లక్షలుగా ఉంది.

తదుపరి వ్యాసం