Tata Nexon EV: ప్రతి 5 ఈవీ విక్రయాల్లో 3 టాటా నెక్సాన్ ఈవీలే
21 October 2022, 12:32 IST
- Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ అమ్మకాల్లో దూసుకుపోతోంది. స్టాండర్డ్ వేరియంట్లతో పాటు నెక్సాన్ ఈవీ మ్యాక్స్, ప్రైమ్ వెర్షన్లతో వచ్చిన నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లతో 66 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది.
టాటా నెక్సాన్‌కు పోటీగా బరిలో నిలవనున్న మహీంద్రా ఈవీ ఎస్‌యూవీ
Tata Nexon EV: టాటా మోటార్స్ ఈ ఏడాది తొలి 9 నెలల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ అమ్మకాల్లో అగ్రగామిగా నిలిచింది. నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీలు సక్సెస్ కావడంలో మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికిల్ సెగ్మెంట్‌లో తన వాటాను 90 శాతానికి పెంచుకుంది.
ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమైన టియాగో ఈవీ వచ్చే ఏడాది ఆరంభంలో అందుబాటులోకి రానుంది. మొత్తంగా ఈవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్ పూర్తి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది.
ఈ ఏడాది తొలి 9 నెలల్లో టాటా మోటార్స్ నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ సహా మొత్తం 30 వేల ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది దేశంలో విక్రయించిన అన్ని ఎలక్ట్రిక్ వాహనాల కంటే ఇది రెట్టింపు కావడం విశేషం.
ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లలో కొనుగోలుదారుల నెంబరు 1 ఛాయిస్ నెక్సాన్ ఈవీ కావడం గమనార్హం. ఇది ఈ సెగ్మెంట్‌లో 66 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ 21,997 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక టిగోర్ 24 శాతం మార్కెట్ వాటాతో 7,903 యూనిట్లు అమ్మి రెండో స్థానంలో ఉంది.
ఈవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్ సమీప ప్రత్యర్థిగా ఎంజీ మోటార్ నిలుస్తోంది. జడ్‌ఎస్ ఈవీతో ఎంజీ మోటార్ మార్కెట్లో 7 శాతం వాటా కలిగి ఉంది. ఇప్పటి వరకు ఎంజీ మోటారు 2,418 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విక్రయించింది. ఇక హ్యుందాయ్ మోటార్స్ మూడో స్థానంలో, మహీంద్రా నాలుగో స్థానంలో, కియా ఐదో స్థానంలో నిలిచాయి.
మొత్తంగా దేశంలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 30 వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. టియాగో ఈవీ, బీవైడీ ఆటో 3, మహీంద్రా ఎక్స్‌యూవీ 400, హ్యుందాయ్ అయోనిక్ 5 వంటి ఇతర ఈవీలు మార్కెట్లో సత్తా చాటేందుకు వస్తున్నాయి. ఈ ఏడాది టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్, కియా ఈవీ6 వంటి ఈవీలు లాంచ్ అయ్యాయి.