తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Swiggy: ‘‘ఆ రోజు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు..’’ - స్విగ్గీ పదేళ్ల ప్రస్థానంపై సీఈఓ కామెంట్స్

Swiggy: ‘‘ఆ రోజు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు..’’ - స్విగ్గీ పదేళ్ల ప్రస్థానంపై సీఈఓ కామెంట్స్

HT Telugu Desk HT Telugu

28 August 2024, 15:39 IST

google News
  • భారత్ లో ఫుడ్ డెలివరీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన స్విగ్గీకి పదేళ్లు. సుమారు పదేళ్ల క్రితం, ఆగస్ట్ 6, 2014న స్విగ్గీ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. అయితే, తొలి రోజు తమకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదని కంపెనీ సీఈఓ శ్రీహర్ష మాజేటి తెలిపారు.

‘‘ఆ రోజు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు..’’ - స్విగ్గీ
‘‘ఆ రోజు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు..’’ - స్విగ్గీ

‘‘ఆ రోజు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు..’’ - స్విగ్గీ

ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజున దాని సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీహర్ష మాజేటి స్విగ్గీ 10 సంవత్సరాల ప్రయాణం గురించి వివరించారు. ఈ ప్రయాణంలో తమకు సహకరించిన కస్టమర్లు, వ్యాపార భాగస్వాములకు ధన్యవాదాలు తెలిపారు.

ఆ రోజు జీరో ఆర్డర్స్

ఆగస్ట్ 6వ తేదీ, 2014 లో స్విగ్గీని ప్రారంభించామని, అయితే, తొలిరోజు తమకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదని శ్రీహర్ష మాజేటి వెల్లడించారు. ‘‘మేము ఆగస్టు 6, 2014 న స్విగ్గీని ప్రారంభించినప్పుడు, మేము జీరో ఆర్డర్లతో ఆ రోజును ముగించాము" అని వెల్లడించారు. "మరుసటి రోజు, మేము మా మొదటి ఆర్డర్ పొందాము. ఇది మా ప్రయాణం నిజమైన ప్రారంభాన్ని సూచిస్తుంది" అన్నారు. 'స్విగ్గీ ఇట్' ను దేశవ్యాప్తంగా ఇంటి పదంగా మార్చడంలో సహాయపడిన స్విగ్గీ సహచరులకు మాజెటి కృతజ్ఞతలు తెలిపారు. స్విగ్గీ (swiggy)లో రోజుకు రెండు ఆర్డర్లతో ప్రారంభమైన ట్రఫుల్స్ తమ తొలి భాగస్వాముల్లో ఒకటని ఆయన చెప్పారు.

3 లక్షల రెస్టారెంట్లు

ఈ రోజు, తాము 3,00,000 రెస్టారెంట్లతో సగర్వంగా భాగస్వామ్యం కలిగి ఉన్నామని స్విగ్గీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీహర్ష మాజేటి తెలిపారు. బెంగళూరుకు చెందిన స్విగ్గీ ఈ ఏడాది చివర్లో పబ్లిక్ ఆఫర్ తో స్టాక్ మార్కెట్ (stock market) లోకి రానుంది. ఇప్పటికే లిస్టెడ్ ప్రత్యర్థి జొమాటో 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వరుసగా ఐదోసారి లాభాలను ఆర్జించింది. జొమాటో (zomato) షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 111 శాతం లాభపడగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ 25 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది.

త్వరలో స్విగ్గీ ఐపీఓ

ఐపీఓ (ipo) కు వచ్చే సమయంలో స్టాక్ మార్కెట్లో ఇప్పటికే లిస్ట్ అయిన తమ ప్రధాన పోటీదారు జొమాటో పై శ్రీహర్ష మాజేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్కెట్లో లిస్టెడ్ పోటీదారు ఉండటం వల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయన్నారు. ‘‘లిస్టెడ్ కంటెస్టెంట్ ఉండటం మంచి, చెడు రెండూ ఉన్నాయి. "ఆన్-డిమాండ్ అంటే ఏమిటి? గిగ్ వర్కర్ ఎకానమీ అంటే ఏమిటి? హైపర్ లోకల్ అంటే ఏమిటి? ఇవన్నీ మేము ఇప్పుడు వివరించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ సానుకూలమైనవి" అన్నారు.

తదుపరి వ్యాసం