Stocks to buy today : స్టాక్స్ టు బై.. టెక్ మహీంద్రా, డీఎల్ఎఫ్ షేర్ ప్రైజ్ టార్గెట్స్ ఇవే!
22 September 2023, 9:14 IST
- Stocks to buy today : ట్రేడర్స్ నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్ టు బై..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను ఫ్లాట్‌గా మొదలుపెట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 15 పాయింట్ల నష్టంతో 66,215 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 19,745 వద్ద కొనసాగుతోంది.
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 570 పాయింట్లు కోల్పోయి 66,230 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 19,742 వద్ద ముగిసింది. ఇక 760 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్ నిఫ్టీ 44,623 మార్క్ వద్దకు చేరింది.
అమెరికా ఫెడ్.. ఈసారి వడ్డీ రేట్లను పెంచలేదు. అది సానుకూల విషయమే అయినప్పటికీ.. వచ్చేడాది పూర్తిగా రేట్ కట్స్ ఉండవని అధికారులు చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లో నెగిటివిటీ నెలకొంది. అందుకే ఇండియన్ స్టాక్ మార్కెట్లు కూడా గత కొన్ని రోజులుగా భారీ నష్టాలను చూస్తున్నాయి.
Stock market news today : ఇక గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3007.36 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1158.14 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
అమెరికా సూచీలు..
ఫెడ్ ఎఫెక్ట్‌తో అమెరికా సూచీలు గురువారం ట్రేడింగ్ సెషన్లో దారుణంగా పతనమయ్యాయి. డౌ జోన్స్ 1.08శాతం, ఎస్ అండ్ పీ 500 1.64శాతం, నాస్డాక్ 1.82శాతం మేర నష్టాలను చూశాయి.
స్టాక్స్ టు బై..
Tech Mahindra share price target : టెక్ మహీంద్రా:- బై రూ. 1292, స్టాప్ లాస్ రూ. 1255, టార్గెట్ రూ. 1350
ఎల్ అండ్ టీ:- బై రూ. 2899, స్టాప్ లాస్ రూ. 2825, టార్గెట్ రూ. 3010
DLF share price target : డీఎల్ఎఫ్:- బై రూ. 517, స్టాప్ లాస్ రూ. 505, టార్గెట్ రూ. 535
ఎం అండ్ ఎం ఫైనాన్స్:- బై రూ. 301, స్టాప్ లాస్ రూ. 292, టార్గెట్ రూ. 318
ఏషియన్ పెయింట్స్:- బై రూ. 3240- రూ. 3244, స్టాప్ లాస్ రూ. 3210, టార్గెట్ రూ. 3300
ఈఎంఐఎల్:- బై రూ. 149- రూ. 150, స్టాప్ లాస్ రూ. 145, టార్గెట్ రూ. 158