Stocks to buy today : స్టాక్స్ టు బై.. రూ. 97 వద్ద ఉన్న ఈ స్టాక్‌తో మంచి లాభాలు!
03 October 2023, 8:59 IST
- Stocks to buy today : ట్రేడర్స్ నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్ టు బై లిస్ట్..
Stocks to buy today : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. కాగా.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 320 పాయింట్లు పెరిగి 65,828 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 115 పాయింట్ల లాభంతో 19,638 వద్ద స్థిరపడింది. 284 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ 44,585 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1685.7 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2752.49 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. మొత్తం మీద సెప్టెంబర్ నెలలో ఎఫ్ఐఐలు రూ. 26692.15 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
Stock market news today : ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ను దేశీయ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ.. ఏకంగా 120 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.22శాతం, ఎస్ అండ్ పీ 500 0.01శాతం మేర నష్టపోయాయి. నాస్డాక్ 0.67శాతం లాభపడింది.
ఇదీ చూడండి:- Car sales : దుమ్మురేపుతున్న ఎస్యూవీ సెగ్మెంట్.. మహీంద్రా, హ్యుందాయ్‌కు బెస్ట్ సేల్స్!
స్టాక్స్ టు బై..
జీఎన్ఎఫ్సీ:- బై రూ. 612, స్టాప్ లాస్ రూ. 600, టార్గెట్ రూ. 640
IGL share price target : ఐజీఎల్:- బై రూ. 456.5, స్టాప్ లాస్ రూ. 448, టార్గెట్ రూ. 475
నేషనల్ అల్యుమీనియం:- బై రూ. 97.2, స్టాప్ లాస్ రూ. 95, టార్గెట్ రూ. 102