తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : స్టాక్స్​ టు బై.. ఎస్​బీఐ, టాటా మోటార్స్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​

Stocks to buy today : స్టాక్స్​ టు బై.. ఎస్​బీఐ, టాటా మోటార్స్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​

Sharath Chitturi HT Telugu

30 June 2023, 7:59 IST

google News
    • Stocks to buy today : ట్రేడర్స్​ నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లకు గురువారం సెలవు. కాగా.. బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 154 పాయింట్లు పెరిగి 18,972 వద్ద ముగిసింది. బీఎస్​ఈ సెన్సెక్స్​ 499 పాయింట్లు మెరుగుపడి 63,915 వద్ద స్థిరపడింది. బ్యాంక్​ నిఫ్టీ 206 పాయింట్ల లాభంతో 44,327 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ అప్​ట్రెండ్​లో కొనసాగుతోంది.

"నిఫ్టీ షార్ట్​ టర్మ్ ట్రేడింగ్​​ ట్రెండ్​ పాజిటివ్​గా ఉంది. కీలకమైన 18,900 రెసిస్టెన్స్​ను నిఫ్టీ అధిగమించేసింది. ఫలితంగా ఇప్పుడు నిఫ్టీ 19,100- 19,200 వరకు పెరగొచ్చు. 18,830 సపోర్ట్​గా ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కు చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 12,350 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1021.01 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఇక దేశీయ సూచీలు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ దాదాపు 111 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

ఇదీ చూడండి:- ఐడియా ఫోర్జ్ ఐపీఓకు విశేష స్పందన; గ్రే మార్కెట్లో 5 వందల రూపాయల వరకు ప్రీమియం

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

అమెరికా స్టక్​ మార్కెట్​లు గురువారం ఫ్లాట్​గా ముగిశాయి. నాస్​డాక్​ ఫ్లాట్​గా ముగిసింది. డౌ జోనస్​ 0.8శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.45శాతం మేర లాభపడ్డాయి.

స్టాక్స్​ టు బై..

SBI share price target : స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ):- బై రూ. 566, స్టాప్​ లాస్​ రూ. 550, టార్గెట్​ రూ. 590

కోల్గేట్​ పాల్మోలివ్​:- బై రూ. 1692.5, స్టాప్​ లాస్​ రూ. 1640, టార్గెట్​ రూ. 1775

Tata Motors share price target : టాటా మోటార్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 567, టార్గెట్​ రూ. 620

అదానీ విల్మర్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 397, టార్గెట్​ రూ. 440

హెచ్​ఏఎల్​:- బై రూ. 3722, స్టాప్​ లాస్​ రూ. 3670, టార్గెట్​ రూ. 3820

హెచ్​సీఎల్​ టెక్​:- బై రూ. 1170, స్టాప్​ లాస్​ రూ. 1150, టార్గెట్​ రూ. 1190

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం