తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​ని ట్రాక్​ చేయండి..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​ని ట్రాక్​ చేయండి..

Sharath Chitturi HT Telugu

28 October 2024, 7:50 IST

google News
    • Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

స్టాక్స్​ టు బై టుడే..

దేశీయ స్టాక్​ మార్కెట్​ల పతనం కొనసాగుతోంది! ఎఫ్​ఐఐల విపరీతమైన విక్రయాలతో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో కూడా సూచీలు భారీగా పతనమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 663 పాయింట్లు పడి 79,402 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 219 పాయింట్లు కోల్పోయి 24,181 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 744 పాయింట్ల పెరిగితో 50,787 వద్దకు చేరింది.

నిఫ్టీ50 ఇండెక్స్ 24,700 మార్క్ దిగువకు పడిపోవడంతో మొత్తం భారత స్టాక్ మార్కెట్ ట్రెండ్ బలహీనంగా ఉందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 50 సూచీకి 23,900 వద్ద తక్షణ మద్దతు ఉందని, 24,600- 24,650 శ్రేణిలో రెసిస్టెన్స్​ ఉందని తెలిపారు. 50 షేర్ల ఇండెక్స్.. 23,900 మార్కు దిగువకు పడిపోతే దలాల్ స్ట్రీట్ ట్రెండ్ మరింత బలహీనపడవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,036.76 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,159.29 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

అక్టోబర్ నెల​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు ఏకంగా రూ. 1,00,242.17 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 97,090.83 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.61శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.03శాతం పతనమైంది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.56శాతం వృద్ధి చెందింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

యథార్థ్ హాస్పిటల్: రూ.649.65 వద్ద కొనుగోలు | టార్గెట్ ధర: రూ.690 | స్టాప్ లాస్: రూ.625

థర్మాక్స్ లిమిటెడ్: రూ.5,431.15 వద్ద కొనుగోలు | టార్గెట్ ధర: రూ.5,750 | స్టాప్ లాస్: రూ.5,222

టొరెంట్ ఫార్మాస్యూటికల్స్: రూ.3,433 వద్ద కొనండి | టార్గెట్ ధర: రూ.3,600 | స్టాప్ లాస్: రూ.3,375

ఐసీఐసీఐ బ్యాంక్: రూ.1,260 కొనొచ్చు| టార్గెట్ ధర: రూ.1,310 | స్టాప్ లాస్: రూ.1,230

బీఈఎల్: రూ.275 కొనుగోలు | టార్గెట్ ధర: రూ.290 | స్టాప్ లాస్: రూ.265

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

కిర్లోస్కర్ న్యూమాటిక్ కంపెనీ: రూ.1,500.55 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1,616, స్టాప్ లాస్ రూ.1,440;

ఆసోమ్ ఎంటర్ప్రైజ్: రూ.158.75 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.168, స్టాప్ లాస్ రూ.152;

ఆర్​బీఎం ఇన్​ఫ్రాకాన్​ : రూ.776 వద్ద కొనండి, టార్గెట్ రూ.830, స్టాప్ లాస్ రూ.748;

దీపక్​ ఫర్టిలైజర్స్​ : రూ.1,133.70 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1,222, స్టాప్ లాస్ రూ.1,100; మరియు

ఆస్టర్ డీఎం హెల్త్​కేర్: రూ .448.75 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .470, స్టాప్ లాస్ రూ .432.

తదుపరి వ్యాసం