Stocks to buy today : స్టాక్స్ టు బై.. అశోక్ లేల్యాండ్, టాటా స్టీల్ షేర్ ప్రైజ్ టార్గెట్స్ ఇవే..
28 July 2023, 8:48 IST
- Stocks to buy today : ట్రేడర్స్ నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
ట్రేడర్లు నేడు గమనించాల్సిన స్టాక్స్ ఇవే!
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో నష్టాలను చూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 440 పాయింట్లు కోల్పోయి 66,267 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 118 పాయింట్ల నష్టంతో 19,660 వద్ద స్థిరపడింది. ఇక బ్యాంక్ నిఫ్టీ.. 383 పాయింట్లు పతనమై 45,679 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో వీక్నెస్ కనిపిస్తోంది.
"నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. రానున్న సెషన్స్‌లో మరింత వీక్నెస్ కనిపించే అవకాశం ఉంది. 19,450 లెవల్స్ వద్ద సపోర్ట్ లభించే అవకాశం ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ 19,850గా ఉంది," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3979 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2528 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ సూచీలు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ.. దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్లో నష్టపోయాయి. డౌ జోన్స్ 0.57శాతం, ఎస్ అండ్పీ 500 0.64శాతం, నాస్డాక్ 0.55శాతం మేర నష్టాలను చూశాయి.
చమురు ధరలు..
చమురు ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 84 డాలర్లకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఈ స్థాయికి ధర చేరుకోవడం ఇదే తొలిసారి.
స్టాక్స్ టు బై..
Stocks to buy : సన్ ఫార్మా:- బై రూ. 1134, స్టాప్ లాస్ రూ. 1110, టార్గెట్ రూ. 1172
దివీస్ ల్యాబ్:- బై రూ. 3742, స్టాప్ లాస్ రూ. 3680, టార్గెట్ రూ. 3910
అశోక్ లేల్యాండ్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 167, టార్గెట్ రూ. 205
టాటా స్టీల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 114, టార్గెట్ రూ. 128
HDFC Life share price target : హెచ్డీఎఫ్సీ లైఫ్:- బై రూ. 662, స్టాప్ లాస్ రూ. 650, టార్గెట్ రూ. 680
మహీంద్రా అండ్ మహీంద్రా ఫినాన్స్:- బై రూ. 312, స్టాప్ లాస్ రూ. 302, టార్గెట్ రూ. 323