Stocks to buy today : రూ. 490 దగ్గర ఉన్న ఈ స్టాక్‌ని కొంటే భారీ లాభాలు..!
27 October 2023, 8:03 IST
- Stocks to buy today : ట్రేడర్లు.. నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
నేటి స్టాక్స్ టు బై లిస్ట్..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ కొనసాగుతోంది! గత కొన్ని రోజులుగా పతనమవుతున్న సూచీలు.. గురువారం ట్రేడింగ్ సెషన్లో కూడా భారీగా పడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 901 పాయింట్లు కోల్పోయి 63,148 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 265 పాయింట్ల నష్టంతో 18,857 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ.. 552 పాయింట్లు కోల్పోయి 42,280 వద్ద స్థిరపడింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం నిఫ్టీలా వీక్నెస్ కొనసాగుతోంది. ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం, బాండ్ ఇండెక్స్ పెరుగుదల, ద్రవ్యోల్బణం, చమురు ధరల వంటివి.. స్టాక్ మార్కెట్ పతనానికి కొన్ని కారణాలు.
"నిఫ్టీలో వీక్నెస్ కనిపిస్తోంది. ఓవర్సెల్డ్ జోన్లోకి చేరుకుంది. లో నుంచి అప్‌సైడ్ బౌన్స్ అయ్యే అవకాశం లేకపోలేదు. కానీ 18,800 లెవల్స్ కన్నా కింద పడితే.. నిఫ్టీలో మరింత వీక్నెస్ కనిపించొచ్చు. 18,600- 18,500 లెవల్స్‌కు చేరొచ్చు," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market news today : గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు ఏకంగా రూ. 7,702.53 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో.. డీఐఐలు రూ. 6,558.45 కోట్లు విలువ చేసే షేర్లను ఇండియా స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేశారు.
దేశీయ సూచీలు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను ఫ్లాట్‌గా మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ.. దాదాపు 10 పాయింట్ల లాస్లో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా సూచీలు..
ఇండియా స్టాక్ మార్కెట్లు మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ సూచీల్లోనూ బ్లడ్ బాత్ కొనసాగుతోంది. ముఖ్యంగా అమెరికా సూచీలు వరుసగా పతనమవుతున్నాయి. గురువారం ట్రేడింగ్ సెషన్లో డౌ జోన్స్ 0.76శాతం, ఎస్ అండ్ పీ 500 1.18శాతం, నాస్డాక్ ఏకంగా 1.76శాతం మేర్ నష్టపోయాయి.
స్టాక్స్ టు బై..
Voltas share price target : వోల్టాస్:- బై రూ. 829, స్టాప్ లాస్ రూ. 808, టార్గెట్ రూ. 865
ఏసీసీ:- బై రూ. 1910, స్టాప్ లాస్ రూ. 1865, టార్గెట్ రూ. 1985
అవ్లాన్ టెక్నాలజీస్:- బై రూ. 490, స్టాప్ లాస్ రూ. 475, టార్గెట్ రూ. 530
మెక్‌డావెల్-ఎన్:- బై రూ. 1010, స్టాప్ లాస్ రూ. 990, టార్గెట్ రూ. 1045
ఎక్స్‌ప్రో ఇండియా:- బై రూ. 1006- రూ. 1012, స్టాప్ లాస్ రూ. 970, టార్గెట్ రూ. 1065,
Stocks to buy : ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్ (ఏడబ్ల్యూహెచ్సీఎల్):- బై రూ. 389- రూ. 391, స్టాప్ లాస్ రూ. 376, టార్గెట్ రూ. 415.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)