Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్! ఈ రూ. 334 స్టాక్‌ని ట్రాక్ చేయండి- లాభాలకు ఛాన్స్!
26 November 2024, 8:14 IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్టాక్స్ టు బై టుడే..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 993 పాయింట్లు పెరిగి 80,110 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 315 పాయింట్లు వృద్ధిచెంది 24,222 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 1072 పాయింట్లు పెరిగి 52,207 వద్దకు చేరింది.
“నిఫ్టీ50.. రెండు సెషన్లలో 1000 పాయింట్లకు పైగా లాభపడింది. 23260 జోన్ సమీపంలో కనిష్టాల నుంచి బలమైన పుల్బ్యాక్ని ఇది సూచిస్తుంది. 24500 జోన్ కీలక రెసిస్టెన్స్‌గా ఉంది. అది దాటితే మార్కెట్లు మరింత పెరగొచ్చు. 23,800 సపోర్ట్‌గా ఉంది,” అని పరిశోధన - ప్రభుదాస్ లిల్లాధర్ వైస్ ప్రెసిడెంట్, టెక్నికల్ రీసెర్చ్ వైశాలి పరేఖ్ తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 9947.55 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6907.97 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించరు.
నవంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 30,999.8 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 30,651.11 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్ 0.99శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.3శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.27శాతం వృద్ధిచెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
ఫెడరల్ బ్యాంక్:- బై రూ. 212.88, స్టాప్ లాస్ రూ. 205, టార్గెట్ రూ. 225
డోమ్స్ ఇండస్ట్రీస్:- బై రూ. 3069, స్టాప్ లాస్ రూ. 2950, టార్గెట్ రూ. 3250
సిప్లా:- బై రూ. 1507, స్టాప్ లాస్ రూ. 1480, టార్గెట్ రూ. 1545
పెట్రోనెట్ ఎల్పీజీ:- బై రూ. 334, స్టాప్ లాస్ రూ. 324, టార్గెట్ రూ. 345
కాన్కర్:- బై రూ. 807, స్టాప్ లాస్ రూ. 795, టార్గెట్ రూ. 845