తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : రూ. 180 దగ్గర ఉన్న ఈ స్టాక్​ కొంటే.. భారీ లాభాలు ఖాయం!

Stocks to buy today : రూ. 180 దగ్గర ఉన్న ఈ స్టాక్​ కొంటే.. భారీ లాభాలు ఖాయం!

Sharath Chitturi HT Telugu

20 October 2023, 8:06 IST

google News
    • Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

Stocks to buy today : అంతర్జాతీయ ప్రతికూల పవనాల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 247 పాయింట్ల నష్టంతో 65,629 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 46 పాయింట్ల లాస్​తో 19,624 వద్ద ముగిసింది. ఇక 134 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్​ నిఫ్టీ 43,754 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో వీక్​నెస్​ కనిపిస్తోంది.

"19,480- 19,450 లెవల్స్​ కీలకమైన సపోర్ట్​గా ఉన్నాయి. ఇక్క సపోర్ట్​ లభిస్తే.. మార్కెట్​ పెరగొచ్చు. కాగా.. 19,700 కలక రెసిస్టెన్స్​గా ఉంది. 19,850 లెవల్స్​ దాటితేనే.. నిఫ్టీలో పాజిటివ్​ ఔట్​లుక్​ కనిపించొచ్చు," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కు చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

Stock market news today : గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1093.47 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 736.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ సూచీలు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. గిఫ్ట్​ నిఫ్టీ.. దాదాపు 150 పాయింట్ల లాస్​లో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

అమెరికా సూచీలు గురువారం కూడా నష్టపోయాయి. డౌ జోన్స్​ 0.7శాతం, నాస్​డాక్​ 0.96శాతం, ఎస్​ అండ్​ పీ 00 0.85శాతం మేర నష్టపోయాయి.

స్టాక్స్​ టు బై..

Lupin share price target : లుపిన్​:- బై రూ. 1200, స్టాప్​ లాస్​ రూ. 1175, టార్గెట్​ రూ. 1254

బీఎస్​ఈ:- బై రూ. 1357.6, స్టాప్​ లాస్​ రూ. 1465, టార్గెట్​ రూ. 1697

ఆదిత్య బిర్లా క్యాపిటల్​:- బై రూ. 183, స్టాప్​ లాస్​ రూ. 178, టార్గెట్​ రూ. 189

పరాస్​ డిఫెన్స్​:- బై రూ. 742, స్టాప్​ లాస్​ రూ. 730, టార్గెట్​ రూ. 760

టాటా ఎలెక్సీ:- బై రూ. 7704, స్టాప్​ లాస్​ రూ. 7550, టార్గెట్​ రూ. 8012

Mind corp share price target : మిండా కార్ప్​:- బై రూ. 363.65, స్టాప్​ లాస్​ రూ. 352, టార్గెట్​ రూ. 387

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం