తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 340 స్టాక్​తో షార్ట్​ టర్మ్​ ప్రాఫిట్స్​!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 340 స్టాక్​తో షార్ట్​ టర్మ్​ ప్రాఫిట్స్​!

Sharath Chitturi HT Telugu

19 August 2024, 8:55 IST

google News
    • Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఇంట్రాడే స్టాక్స్​, బ్రేకౌట్​ స్టాక్స్​ లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

Stocks to buy today : అమెరికాలో మాంద్యం భయాలు పూర్తిగా తొలగిపోవడంతో దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1331 పాయింట్లు పెరిగి 80,437 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 397 పాయింట్లు పెరిగి 24,541 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 790 పాయింట్లు పెరిగి 50,517 వద్దకు చేరింది.

నిఫ్టీ 400-500 పాయింట్ల శ్రేణిలో కన్సాలిడేటెడ్ అయిన తర్వాత 24,500 పైకి వెళ్లింది. సమీపకాలంలో నిఫ్టీ 24,300 - 24,550 శ్రేణిలో కన్సాలిడేషన్​ని కొనసాగించవచ్చు. 24,550 పైన నిర్ణయాత్మక కదలిక తర్వాతే సూచీలో డైరెక్షన్​ ట్రెండ్ కనిపించొచ్చు,​" అని ఎల్​కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే అన్నారు. నిఫ్టీ 24,300 దిగువకు పడిపోతే తప్ప బై ఆన్ డిప్స్ వ్యూహం మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 766.52 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,606.18 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 28976.91 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 34060.09 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.24శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.2శాతం వృద్ధిచెందింది. నాస్​డాక్​ 0.09శాతం మేర స్వల్ప వృద్ధిని నమోదు చేసింది.

స్టాక్స్​ టు బై టుడే..

ఇండస్ ఇండ్ బ్యాంక్: రూ.1364 వద్ద కొనండి, టార్గెట్ రూ.1420, స్టాప్​ లాస్​ రూ.1335

బయోకాన్: రూ.340.95, టార్గెట్ రూ.357, స్టాప్ లాస్ రూ.332

శోక్ లేలాండ్: రూ .255.95 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .268, స్టాప్ లాస్ రూ .249

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

గ్రావిటా ఇండియా: రూ.2216.55 వద్ద కొనండి, టార్గెట్ రూ.2325, స్టాప్ లాస్ రూ.2140

అనంత్ రాజ్: రూ.586.15 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.615, స్టాప్ లాస్ రూ.565

జిందాల్ పాలీ ఫిల్మ్స్: రూ.889.50 వద్ద కొనండి, టార్గెట్ రూ.935, స్టాప్ లాస్ రూ.855

సుప్రజిత్ ఇంజినీరింగ్: రూ.620.50 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.650, స్టాప్ లాస్ రూ.599

కైటెక్స్ గార్మెంట్స్: రూ .323.80 వద్ద కొనండి, టార్గెట్ రూ .340, స్టాప్ లాస్​ రూ .312

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం