Stocks to buy today : ఈ రూ. 170 స్టాక్‌ని కొంటే.. షార్ట్ టర్మ్‌లో భారీ లాభాలు!
13 November 2023, 9:42 IST
- Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్ టు బై టుడే..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 261 పాయింట్లు కోల్పోయి 64,998 వద్ద ఉంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 73 పాయింట్ల నష్టంతో 19,452 వద్ద కొనసాగుతోంది.
"నిఫ్టీకి 19,500 లెవల్ చాలా కీలకం. అది దాటితే.. 19,800 వరకు నిఫ్టీ వెళ్లే అవకాశం ఉంది. 19,250- 19,300 లెవల్స్ సపోర్ట్‌గా ఉన్నాయి," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
లాభాలు.. నష్టాలు..
ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫీ, నెస్లే, కొటాక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, టెక్ఎం, టాటా స్టీల్, టీసీఎస్, విప్రో, ఎంఎం, ఎస్బీఐ, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Stock market news today : ఇండియా స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగుతున్నాయి. అక్టోబర్‌లో భారీగా విక్రయాలు చేసిన ఎఫ్ఐఐలు.. నవంబర్‌లో కూడా అదే చేస్తున్నారు. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో రూ. 261.81 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 822.64 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా సూచీలు భారీగా లాభపడ్డాయి. డౌ జోన్స్ 1.15శాతం, ఎస్ అండ్ పీ 500 1.56శాతం, నాస్డాక్ 2.05శాతం మేర లాభాలు చూశాయి.
స్టాక్స్ టు బై..
Axis bank share price target : యాక్సిస్ బ్యాంక్:- బై రూ. 1029, స్టాప్ లాస్ రూ. 1005, టార్గెట్ రూ. 1070
ఎన్ఎండీసీ:- బై రూ. 168, స్టాప్ లాస్ రూ. 163, టార్గెట్ రూ. 176.5
సిటీ యూనియన్ బ్యాంక్:- బై రూ. 142, స్టాప్ లాస్ రూ. 138, టార్గెట్ రూ. 150
క్వెస్ కార్ప్:- బై రూ. 466- రూ. 467, స్టాప్ లాస్ రూ. 456, టార్గెట్ రూ. 487
Apollo pipe share price target : అపొలో పైప్:- బై రూ. 696- రూ. 697, స్టాప్ లాస్ రూ. 685, టార్గెట్ రూ. 716