తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : రూ. 190 దగ్గర ఉన్న ఈ స్టాక్​ కొంటే.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Stocks to buy today : రూ. 190 దగ్గర ఉన్న ఈ స్టాక్​ కొంటే.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu

12 January 2024, 8:04 IST

google News
    • Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 63 పాయింట్లు పెరిగి 71,721 వద్ద స్థిరపడింది.​ ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 28 పాయింట్ల లాభంతో 21647 వద్ద ముగిసింది. ఇక 77 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ 47,438 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో డౌన్​వర్డ్​ కన్సాలిడేషన్​ కనిపిస్తోంది. 21,850 లెవల్స్​ దాటితే అప్​ట్రెండ్​ మొదలవ్వొచ్చు. నిఫ్టీ సపోర్ట్​ 21,590గా ఉంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 865 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1607.08 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

Stock market news today : ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ.. దాదాపు 20 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు సైతం ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.04శాతం మేర పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500 0.07శాతం పడింది. నాస్​డాక్​లో మార్పు లేదు.

అమెరికా డిసెంబర్​ నెలకు సంబంధించిన సీపీఐ డేటా వెలువడింది. అంచనాలు 3.2శాతంగా ఉండగా.. సీపీఐ డేటా 3.4శాతంగా నమోదైంది.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : ఆర్​బీఎల్​ బ్యాంక్​:- బై రూ. 295, స్టాప్​ లాస్​ రూ. 285, టార్గెట్​ రూ. 310

టీవీఎస్​ మోటార్​:- బై రూ. 2082, స్టాప్​ లాస్​ రూ. 2045, టార్గెట్​ రూ. 2131

BEL share price target : బీఈఎల్​:- బై రూ. 187, స్టాప్​ లాస్​ రూ. 180, టార్గెట్​ రూ. 195

అదానీ ఎంటర్​ప్రైజెస్​:- బై రూ. 3080, స్టాప్​ లాస్​ రూ. 3040, టార్గెట్​ రూ. 3140

నారాయణ హృదయాలయ (ఎన్​హెచ్​):- బై రూ. 1268- రూ. 1271, స్టాప్​ లాస్​ రూ. 1240 టార్గెట్​ రూ. 1324

SSWL share price target : ఎస్​ఎస్​డబ్ల్యూఎల్​:- బై రూ. 273- రూ. 274, స్టాప్​ లాస్​ రూ. 260, టార్గెట్​ రూ. 300

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం