తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy : ఈ 5 స్టాక్స్‌పై నిపుణుల సలహా.. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా

Stocks to Buy : ఈ 5 స్టాక్స్‌పై నిపుణుల సలహా.. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా

Anand Sai HT Telugu

17 September 2024, 8:22 IST

google News
    • Stocks to Buy : ఈరోజు కొనాల్సిన స్టాక్స్‌పై నిపుణులు సలహా ఇచ్చారు. ట్రేడింగ్‌లో టార్గెట్ ధర, స్టాప్ లాస్ గురించి వివరించారు. నిపుణుల ప్రకారం నేడు కొనాల్సిన స్టాక్స్ ఏంటో చూద్దాం..
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈరోజు నిపుణులు 5 స్టాక్స్ ఎంచుకున్నారు. వీటితో రాబడి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా మంగళవారం రెండు స్టాక్ ఎంపికలను సిఫారసు చేయగా, మిగిలిన మూడు స్టాక్స్ ను ఆనంద్ రాఠీ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ మేనేజర్ గణేష్ డోంగ్రే కొనుగోలు చేయాలని సిఫారసు చేశారు. వీటిలో ఫోర్టిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్, బ్లూ స్టార్ లిమిటెడ్, ఇంటెలిజెన్స్ డిజైన్ ఎరీనా లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఉన్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి మాట్లాడుతూ మార్కెట్ అప్‌ట్రెండ్ కొనసాగుతోందని చెప్పారు. నిఫ్టీ చివరికి 25450 వద్ద రేంజ్ కదలికను అధిగమించి సమీపకాలంలో 25800 వద్ద తదుపరి నిరోధం వైపు కదలవచ్చు. తక్షణ మద్దతు 25150 స్థాయిలో ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఈ వారంలోనే తెరపైకి రానుంది. మరోవైపు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ గత వారం తన పాలసీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.50 శాతానికి తగ్గించిందని మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ (వెల్త్ మేనేజ్మెంట్) హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలిపారు.

అమెరికా ఫెడ్ బుధవారం తన వడ్డీరేట్ల నిర్ణయాన్ని ప్రకటించనుంది. అక్కడ రేట్లు కనీసం 25 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని భావిస్తున్నారు. యూకే, జపాన్, చైనాలకు చెందిన మరికొన్ని పెద్ద సెంట్రల్ బ్యాంకులు కూడా ఈ వారంలో సమావేశం కానున్నాయని ఖేమ్కా తెలిపారు. వడ్డీరేట్ల తగ్గింపు మార్కెట్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. దేశీయ మార్కెట్‌కు సానుకూలంగా ఉంచుతుంది.

ఫోర్టిస్ హెల్త్ కేర్ లిమిటెడ్ స్టాక్స్ : ఫోర్టిస్ హెల్త్ కేర్ లిమిటెడ్‌లో రూ.630 టార్గెట్‌తో రూ.596.85 వద్ద కొనుగోలు సిఫార్సు ఉంది.

బ్లూ స్టార్ లిమిటెడ్ : రెండో స్టాక్‌గా బగారియా బ్లూ స్టార్ లిమిటెడ్‌ను సూచించారు. బ్లూ స్టార్ రూ.1934.9 వద్ద, రూ.1868 స్టాప్ లాస్, రూ.2040 టార్గెట్‌తో కొనుగోలు చేయాలని చెప్పారు.

ఇంటెలిజెన్స్ : రూ.995 స్టాప్ లాస్‌తో రూ.1025 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ రూ.2940కు కొనుగోలు చేయాలని డోంగ్రే సూచించారు. ఈ షేరు టార్గెట్ ధర రూ.3040 కాగా, స్టాప్ లాస్‌ను రూ.2870 వద్ద ఉంచాలని చెప్పారు.

కోరమాండల్ : రూ.1750 టార్గెట్ ధరకు రూ.1680 స్టాప్ లాస్‌, రూ.1706 వద్ద కొనుగోలు సిఫార్సు చేశారు.

గమనిక : నిపుణుల సిఫార్సులు, సలహాలు, అభిప్రాయాలు వారివే తప్ప HT Teluguవి కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌కు లోబడి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం