తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మీకు ఫొటోగ్రఫీ హాబీ ఉంటే ఈ స్మార్ట్‌ఫోన్స్‌‌ను చూసేయండి.. ఎందుకంటే వీటిలో కెమెరా 200ఎంపీ

మీకు ఫొటోగ్రఫీ హాబీ ఉంటే ఈ స్మార్ట్‌ఫోన్స్‌‌ను చూసేయండి.. ఎందుకంటే వీటిలో కెమెరా 200ఎంపీ

Anand Sai HT Telugu

22 December 2024, 20:30 IST

google News
    • 200MP Camera Smartphones : కొందరికి ఫొటోగ్రఫీ హాబీ ఉంటుంది. అలాంటివారు కెమెరా బాగున్న స్మార్ట్‌ఫోన్స్ తీసుకోవాలి. 200ఎంపీ కెమెరాతో వచ్చే స్మార్ట్‌ఫోన్ల గురించి చూద్దాం..
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా

ఫోటోగ్రఫీ కొందరికి ఇష్టమైన హాబీ. అయితే అందరూ కెమెరా కొనుక్కోలేరు. అలాంటి వారు ఇప్పుడు ఫోన్లలోనూ ఫొటోలు తీయోచ్చు. మంచి క్వాలిటీ ఉన్న కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్స్ మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. మీరు ఫొటోగ్రఫీ లవర్స్ అయితే మీ కోసం కొన్ని ఫోన్లు దొరుకుతాయి. మీకోసం లిస్టు ఉంది. 200ఎంపీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్లలో మీకు ఏది ఇష్టమో చూసి సెలక్ట్ చేసుకోండి.

వీటి కోసం మీరు బడ్జెట్ కూడా పెద్దగా పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఇందులో రూ.20 వేల నుంచి రూ.లక్ష ధర వరకు ఉన్న ఫోన్లు ఉన్నాయి. తక్కువ బడ్జెట్లోనూ కావాల్సిన ఫోన్ కొనుగోలు చేయెుచ్చు. మీ బడ్జెట్ ఎక్కువగా ఉంటే హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మంచి ప్రాసెసర్‌తోపాటుగా అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. లిస్టు ఓసారి చూసేద్దాం..

రెడ్‌మీ నోట్ 13 ప్రో

రెడ్‌మీ నోట్ 13 ప్రో ఫోన్ ఈ ఏడాది జనవరి నెలలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ఉంది. ఫోన్‌లో అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది 5100mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ, 2 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా ఉన్నాయి. ఇందులో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. రెడ్‌మీ నోట్ 13 ప్రో ఫోన్‌ను రూ.18,349 ప్రారంభ ధరతో కొనుగోలు చేయెుచ్చు.

రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్

రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఇది 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్ 5000mAh కెపాసిటీ బ్యాటరీతో వస్తుంది. దీన్ని ఛార్జ్ చేయడానికి 120W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం అందిస్తారు. ఈ మొబైల్‌ను రూ.23,739కి కొనుగోలు చేయవచ్చు.

వివో ఎక్స్200 ప్రో

వివో ఎక్స్200 ప్రో ఫోన్ 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 4500 నిట్‌ల బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇది 6000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఛార్జ్ చేయడానికి 90వాట్స్, 30వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. వివో ఎక్స్200 ప్రోలో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్​వైటీ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జెఎన్ 1 అల్ట్రావైడ్ కెమెరా, 3.7 ఎక్స్ ఆప్టికల్ జూమ్​తో 200 మెగాపిక్సెల్ జేఐఎస్ఎస్ ఏపీఓ టెలీఫోటో కెమెరా ఉన్నాయి. ఇందులో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ధర రూ.94,999గా ఉంది

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ ఈ ఏడాది విడుదలైంది. ఈ మొబైల్ 6.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్, ఓఐఎస్ సపోర్ట్ తో మరో 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 5000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని వస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.1,21,999గా ఉంది.

గమనిక : స్మార్ట్‌ఫోన్‌ల ధరలు స్టోరేజ్ ఆధారంగా మారుతాయి. అంతేగాకుండా వివిధ ఆఫర్లలో తక్కువకు కూడా దొరకవచ్చు. భవిష్యత్తులో కూడా ఈ ధరలు మారవచ్చు.

తదుపరి వ్యాసం