రెడ్‌మీ నోట్ 14 ప్రో సిరీస్ కొత్త ఫోన్లు లాంచ్.. మంచి వీడియో క్వాలిటీ, సూపర్ బ్యాటరీ కెపాసిటీ-redmi note 14 pro series launched in india with 6200mah battery good video quality starting price at 23999 rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రెడ్‌మీ నోట్ 14 ప్రో సిరీస్ కొత్త ఫోన్లు లాంచ్.. మంచి వీడియో క్వాలిటీ, సూపర్ బ్యాటరీ కెపాసిటీ

రెడ్‌మీ నోట్ 14 ప్రో సిరీస్ కొత్త ఫోన్లు లాంచ్.. మంచి వీడియో క్వాలిటీ, సూపర్ బ్యాటరీ కెపాసిటీ

Anand Sai HT Telugu
Dec 09, 2024 04:00 PM IST

Redmi Note 14 Pro Series Launched : రెడ్‌మీ నోట్ 14 ప్రో సిరీస్‌లో రెండు స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. నోట్ 14 ప్రో ప్లస్‌లో అతిపెద్ద 6200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అన్ని ఫోన్లు హైపర్ ఓఎస్‌తో పనిచేస్తాయి. ఈ ఫోన్‌ ధరతోపాటుగా ఇతర వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

రెడ్‌మీ నోట్ 14 ప్రో సిరీస్ నుంచి కొత్త ఫోన్లు లాంచ్
రెడ్‌మీ నోట్ 14 ప్రో సిరీస్ నుంచి కొత్త ఫోన్లు లాంచ్

రెడ్‌మీ 14 నంబర్ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రెడ్‌మీ నోట్ 14 సిరీస్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. రెడ్‌మీ నోట్ 14 ప్రో, రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేశారు. రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్‌లో అతిపెద్ద 6200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. నోట్ 14 ప్రో సిరీస్‌లోని రెండు ఫోన్లలో కంపెనీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సేఫ్టీని ఇచ్చింది. ఈ ఫోన్లన్నీ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్‌తో పనిచేస్తాయి.

yearly horoscope entry point

రెడ్‌మీ mi.com, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్‌లో రెడ్‌మీ నోట్ 14 సిరీస్ సేల్‌కు అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రెడ్‌మీ నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో ప్లస్ స్పెక్టర్ బ్లూ, టైటాన్ బ్లాక్, ఫాంటమ్ పర్పుల్(లెదర్ ఫినిష్) రంగుల్లో లభిస్తాయి.

కంపెనీ నోట్ 14 ప్రో సిరీస్‌ను 5 వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో నోట్ 14 ప్రో ప్లస్ 3 వేరియంట్లు, నోట్ 14 ప్రో 2 వేరియంట్లలో ఉన్నాయి.

రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ మూడు వేరియంట్ల వివరాలు

రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ బేస్ 8జీబీ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .29,999.

రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ 8జీబీ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999.

రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ టాప్ వేరియంట్ 12 జీబీ ప్లస్ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999.

రెడ్‌మీ నోట్ 14 ప్రో రెండు వేరియంట్ల వివరాలు

రెడ్‌మీ నోట్ 14 ప్రో బేస్ 8జీబీ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .23,999.

రెడ్‌మీ నోట్ 14 ప్రో 8జీబీ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999.

రెడ్ మీ నోట్ 14 ప్రో ఫీచర్లు

ఈ ఫోన్ లో 6.67 అంగుళాల 1.5కే అమోఎల్ఈడీ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 ప్రొటెక్షన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్ సెట్‌తో వస్తున్న ఈ ఫోన్ మిడ్ రేంజ్ విభాగంలో మంచి పనితీరు కనబరుస్తుంది. కెమెరా విషయానికొస్తే రెడ్‌మీ నోట్ 14 ప్రోలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 5,500 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 45 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ ఫీచర్లు

ఫ్లాగ్ షిప్ ఫీచర్లతో వస్తున్న ఈ హైఎండ్ మోడల్ ఈ సిరీస్‌లో హీరో అని చెప్పవచ్చు. రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్‌లో 6.67 అంగుళాల 1.5కే కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్‌సెట్‌ను అందించారు. నోట్ 14 ప్రో ప్లస్‌లో ట్రిపుల్ రియర్ సిస్టమ్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ప్రోలెవల్ సెల్ఫీలు, మంచి వీడియో కాల్ క్వాలిటీ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 6,200 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించారు.

Whats_app_banner