Smart Phone launches: రాబోయే వారాల్లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్స్; వీటి కోసం వెయిట్ చేయొచ్చు..
19 December 2024, 15:14 IST
Smart Phone launches: స్మార్ట్ ఫోన్ తయారీ దారులు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ను విడుదల చేస్తున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో కూడా పలు కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి రానున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
రాబోయే వారాల్లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్స్
Smart Phone launches: గత వారాల్లో, వివో ఎక్స్ 200 సిరీస్, రెడ్మి నోట్ 14 సిరీస్, రియల్మీ 14ఎక్స్ లతో పాటు ఇతర ధరల శ్రేణిలో అనేక ప్రధాన స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు 2025 లోకి ప్రవేశిస్తున్నందున, కొత్త సంవత్సరంలో తొలి వారాల్లో మరికొన్ని స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కానున్నాయి. అందువల్ల, మీరు స్మార్ట్ఫోన్ అప్ గ్రేడ్ కోసం ప్లాన్ చేస్తుంటే, వన్ప్లస్ 13 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ వంటి ప్రధాన స్మార్ట్ ఫోన్ల లాంచ్ (smart phones launch) కోసం ఎదురు చూడడం మంచిదే. రాబోయే వారాల్లో లాంచ్ అయ్యే ప్రముఖ స్మార్ట్ ఫోన్ల జాబితా మీ కోసం...
వన్ ప్లస్ 13 మరియు వన్ ప్లస్ 13ఆర్
ఈ వారం, వన్ ప్లస్ (oneplus) 13 సిరీస్ భారతదేశ లాంచ్ అయ్యే తేదీ కన్ఫర్మ్ అయింది. వన్ ప్లస్ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ 2025 జనవరి 7న లాంచ్ కానున్నాయి. వీటిలో రెండు మోడళ్ల డిజైన్లను కూడా వన్ ప్లస్ బహిర్గతం చేసింది. వన్ ప్లస్ 13 స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ చిప్ తో పనిచేస్తుందని, వన్ ప్లస్ 13ఆర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ తో పనిచేస్తుందని సమాచారం. వన్ ప్లస్ 13 ఫ్లాగ్ షిప్ సెగ్మెంట్లో లాంచ్ కానుండగా, వన్ ప్లస్ 13ఆర్ ధర మునుపటి తరం మోడల్ ప్రకారం సుమారు రూ.40,000 రేంజ్ లో ఉండవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్
శాంసంగ్ (samsung) గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్మార్ట్ ఫోన్ లో గెలాక్సీ ఎస్ 25, గెలాక్సీ ఎస్ 25 ప్లస్, గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా అనే మూడు మోడళ్లు ఉంటాయి. 2025 జనవరి 22న ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని సమాచారం. అయితే అధికారికంగా లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. ఈ మూడు స్మార్ట్ ఫోన్స్ లో స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ చిప్సెట్ ఉండనుందని తెలుస్తోంది. వీటిలో మునుపటి కంటే భారీ అప్ గ్రేడ్లు లభించనున్నాయి.
అసుస్ రోగ్ ఫోన్ 9
ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయింది. కానీ, ఈ స్మార్ట్ ఫోన్ (smartphones) ఇంకా భారతదేశంలో అరంగేట్రం చేయలేదు. ఇది కూడా ప్రీమియం సిరీస్ స్మార్ట్ ఫోన్. ఇది స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ చిప్ తో పనిచేస్తుంది. ఇది పెర్ఫార్మెన్స్ సెగ్మెంట్ మోడల్ గా కనిపిస్తోంది. ఆసుస్ రోగ్ ఫోన్ 9 వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
షియోమీ 15 సిరీస్
షియోమీ (xiaomi) తన ఫ్లాగ్ షిప్ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ షియోమీ 15, షావోమి 15 ప్రో లను కూడా రాబోయే వారాల్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే అనేక గ్లోబల్ సర్టిఫికేషన్లలో కనిపించింది. త్వరలో గ్లోబల్ లాంచ్ కానుందని సంకేతాలు ఇచ్చింది. ఫ్లాగ్ షిప్ పనితీరును అందించే స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ చిప్సెట్ తో ఈ స్మార్ట్ఫోన్ పనిచేస్తుందని తెలుస్తోంది.