Skoda Car : తక్కువ ధరకే కొత్త స్కోడా కారు.. కిర్రాక్ డిజైన్.. మార్కెట్‌లోకి వచ్చేది అప్పుడే!
27 August 2024, 17:30 IST
- Skoda Kylaq Car : మార్కెట్‌లో స్కోడా కార్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా మంది ఈ కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే స్కోడా.. తన కొత్త కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. స్కోడా కైలాక్ పేరుతో రోడ్ల మీదకు రానుంది. ఇప్పటికే టెస్ట్ డ్రైవ్ చేసింది.
స్కోడా కైలాక్ కారు
స్కోడా ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారుగా గుర్తింపు పొందింది. భారతీయ మార్కెట్‌లో ఈ కంపెనీ కార్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వినూత్న శైలి డిజైన్ ఆకర్షణీయమైన ఫీచర్లతో అనేక కార్లను విక్రయిస్తోంది. వినియోగదారులు కూడా కొనుగోలు చేసేందుకు ఇష్టంగా ఉన్నారు. స్కోడా నుంచి మరో కొత్త కారు రానుంది. రాబోయే కొత్త సబ్ కాంపాక్ట్ SUV పేరు ప్రకటించారు. దీనికి స్కోడా కైలాక్ అని పేరు పెట్టారు. ఈ కారు టెస్ట్ డ్రైవ్‌లలో చాలా సార్లు కనిపించింది. డిజైన్‌కు సంబంధించిన పలు వివరాలు బయటకు వచ్చాయి.
ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
కొద్ది రోజుల క్రితం కొత్త స్కోడా కైలాక్ ఎస్‌యూవీ టెస్ట్ డ్రైవ్ చేశారు. ఆన్‌లైన్‌లో లీక్ అయిన స్పై ఫోటోలు కారులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉంటుందని నిర్ధారిస్తుంది. సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న టీజర్ ఫోటోలు కొత్త స్కోడా కైలాక్‌లో స్ప్లిట్ హెడ్‌లైట్లు, LED DRLలు, L- ఆకారపు LED టైల్‌లైట్లు, అల్లాయ్ వీల్స్ ఉన్నాయని అర్థమవుతోంది.
ఈ కారు 1-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్‌తో నడిచే అవకాశం ఉంది. గరిష్టంగా 115 PS శక్తిని, 178 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుందని అంచనా. ఇందులో కూడా ఐదుగురు హాయిగా ప్రయాణం చేయవచ్చు.
ఈ ఫీచర్లు ఉండే అవకాశం
స్కోడా కైలాక్ అనేక అధునాతన ఫీచర్లతో రానుంది అంటున్నారు. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, పూర్తి-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. భద్రత పరంగా 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), 360-డిగ్రీ కెమెరాను కలిగి ఉండే ఛాన్స్ ఉంది.
ధర అంచనా
ఫిబ్రవరి 2025లో షోరూమ్‌కి చేరుకుంటుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కారుకు సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2025 జనవరి రెండో వారంలో భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో అధికారిక ధరను ప్రకటించొచ్చు. సరికొత్త స్కోడా కేలాక్ ఎస్‌యూవీ చాలా సరసమైన ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని అంటున్నారు. రూ. 8.5 లక్షల నుంచి రూ.14 లక్షల ఎక్స్-షోరూమ్ ధరగా ఉండే అవకాశం ఉంది.
టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ3ఎక్స్ఓ, మారుతి సుజుకి బ్రెజ్జా, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్‌కు పోటీగా స్కోడా కైలాక్ రానుంది. ఈ కారుపై కస్టమర్లకు అనేక అంచనాలు ఉన్నాయి. అత్యాధునిక డిజైన్, ఫీచర్లతో వచ్చే ఈ కారు చాలా మందికి నచ్చుతుంది.