Car Buying Tips : ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా? ఈ లిస్ట్ ఒక్కసారి చూడండి-car buying tips for first time buyers this cars best for you hyundai exter to maruti suzuki alto k10 check list here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Car Buying Tips : ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా? ఈ లిస్ట్ ఒక్కసారి చూడండి

Car Buying Tips : ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా? ఈ లిస్ట్ ఒక్కసారి చూడండి

Anand Sai HT Telugu
Aug 26, 2024 08:00 PM IST

Car Buying Tips For First Time Buyers : మెుదటిసారి కారు కొనే సమయంలో కన్ఫ్యూజన్ ఉండటం సహజం. ఏ కారు కొనాలి? ఫీచర్లు ఎలా ఉంటాయోనని మదిలో ప్రశ్నలు మెదులుతూనే ఉంటాయి. అలాంటివారు ఈ కింది లిస్ట్ చూడండి. మీరు ఏ కారు కొనాలో ఒక క్లారిటీ వస్తుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్
మారుతి సుజుకి స్విఫ్ట్

ఇటీవల కారు కొనడం కామన్ అయిపోయింది. మిడిల్ క్లాస్ ఇంట్లో కూడా కచ్చితంగా కారు ఉంటుంది. ఒకప్పుడు కారు అంటే ధనవంతులకే ఉండేది. కానీ ఇప్పుడు అందరూ కారు కొనాలనే ఆసక్తితో ఉన్నారు. కొన్నేళ్లుగా కొత్త కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. కొత్త కారును కొనుగోలు చేసే చాలా మంది తమ బడ్జెట్‌లో అది లభిస్తుందో లేదో అనే ఆలోచనలో ఉంటారు. ఇక్కడ మీ కోసం కొన్ని కార్ కలెక్షన్స్ అందిస్తున్నాం. వాటిలో మీ బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్‌గా ఉంటుందో డిసైడ్ చేసుకోండి.

మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ గురించి మాట్లాడుకుంటే.. ఈ కారు ధర రూ. 3.99 లక్షల నుండి రూ. 5.96 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 1-లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్‌ను కలిగి ఉంది. 24.39 నుండి 33.85 kmpl మైలేజీని అందిస్తుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఫీచర్లతో నిండి ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు బాగుంటుంది. రూ.6.49 లక్షల నుండి రూ.9.60 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 1.2-లీటర్ 3-సిలిండర్ Z సీరియస్ పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. 24.8 నుండి 25.72 kmpl మైలేజీని అందిస్తుంది. అందులో 5 మంది హాయిగా కూర్చోని వెళ్లవచ్చు. స్విఫ్ట్ 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, USB టైప్-ఎ అండ్ టైప్-సి పోర్ట్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో క్లైమేట్ కంట్రోల్‌తో సహా వివిధ ఫీచర్లను అందిస్తుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లను కలిగి ఉంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఒక ప్రముఖ ఎస్‌యూవీ. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.6.13 లక్షల నుంచి రూ.10.43 లక్షల మధ్యలో ఉంది. 1.2-లీటర్ పెట్రోల్, CNG ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. 19.4 నుండి 27.1 kmpl మైలేజీని అందిస్తాయి. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో సహా అనేక రకాల ఫీచర్లతో వస్తుంది.

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 5.65 లక్షల నుండి రూ. 8.90 లక్షల వరకు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి. 20.01 నుండి 28.06 kmpl మైలేజీని ఇస్తుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లను పొందుతుంది.