తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Skoda 7 Seater Car : తప్పదు వెయిట్ చేయాల్సిందే.. స్కోడా కుషాక్ 7 సీటర్ వచ్చేది అప్పుడే

Skoda 7 Seater Car : తప్పదు వెయిట్ చేయాల్సిందే.. స్కోడా కుషాక్ 7 సీటర్ వచ్చేది అప్పుడే

Anand Sai HT Telugu

11 November 2024, 18:30 IST

google News
    • Skoda kushaq 7 Seater : ఫ్యామిలీతో జర్నీకి 7 సీటర్ కార్లు పక్కాగా ఉంటాయి. ఈ సెగ్మెంట్‌లోకి స్కోడా కుషాక్ కూడా రానుంది. అయితే లాంచ్ డేత్ కాస్త దూరంగానే ఉండనుంది.
7 సీటర్‌తో రానున్న స్కోడా కుషాక్
7 సీటర్‌తో రానున్న స్కోడా కుషాక్

7 సీటర్‌తో రానున్న స్కోడా కుషాక్

ఇటీవలి కాలంలో 7 సీట్ల కార్లకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్‌లో మారుతి ఎర్టిగా రెండు నెలలుగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా అవతరించింది. ఇది 7 సీటర్ ఎంపీవీ. ఎమ్‌పీవీ, ఎస్‌యూవీ అయినా 7 సీట్ల ఆప్షన్స్ కోసం జనాలు ఎక్కువగా వెతుకుతున్నారు. కొన్ని కంపెనీలు 7-సీటర్ వెర్షన్‌లను లైనప్‌లో పెట్టాయి. మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ రాబోయే మూడు వెర్షన్ల గురించి ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఇప్పుడు స్కోడా దాని ప్రసిద్ధ ఎస్‌యూవీ కుషాక్ 7-సీటర్ వెర్షన్‌ కోసం పని చేస్తోంది. భారత్‌లో పాతుకుపోవాలనే లక్ష్యంతో స్కోడా కొద్దిరోజుల క్రితం కైలాక్ అనే కొత్త మోడల్‌ను విడుదల చేసింది. రూ.7.89 లక్షల ఎక్స్-షోరూమ్ ధర, సబ్-4 మీటర్ల SUV భారతదేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాల నుండి పెద్ద సంఖ్యలో కస్టమర్లను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. దీనితో పాటు పెద్ద ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకుని 7-సీటర్ వెర్షన్ కుషాక్ లాంచ్ కానుంది.

ప్రస్తుతం స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. స్కోడా కుషాక్ 7 సీటర్ కారు 2027లో రానుంది. ఈ మేరకు నివేదికలు చెబుతున్నాయి. కొత్త కుషాక్ మూడు వరుసల సీటింగ్ లేఅవుట్‌కు అనుగుణంగా MQB AO 37 అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తారు.

కుషాక్ ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీ కాబట్టి, ప్రస్తుత ప్లాట్‌ఫారమ్‌లో మరో వరుస సీట్లను అమర్చడం సవాలుగా ఉంటుంది. ఈ మార్పులపై కంపెనీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఎంజీ మోటార్ ఇండియా, కియా, హ్యుందాయ్, మహీంద్రా, జీప్ బ్రాండ్‌లు 7 సీట్ల ఎస్‌యూవీల సెగ్మెంట్‌లో చురుకుగా ఉన్నాయి. ఈ కేటగిరీకి స్కోడా చేరనుంది.

మరోవైపు ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ తన డస్టర్ ఎస్‌యూవీని త్వరలో భారత్‌కు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. కేరళ రోడ్లపై దీన్ని పరీక్షిస్తున్నారు. డస్టర్ 7-సీటర్ వెర్షన్ కూడా డాసియా బిగ్‌స్టర్ కాన్సెప్ట్ ఆధారంగా వస్తోంది.

తదుపరి వ్యాసం