Upcoming Cars : 10 లక్షలలోపు ధరతో రయ్..రయ్ అంటూ రాబోయే కార్లు.. లిస్టులో స్కోడా కూడా
Upcoming Cars In India : భారతదేశంలో మరికొన్ని రోజుల్లో కార్లు లాంచ్ కాబోతున్నాయి. ఇవి పది లక్షలలోపు ధరతో వస్తున్నాయి. ఆ లిస్టులో ఏం ఉన్నాయో చూద్దాం..
కారు కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా బడ్జెట్‌ను చూసుకుంటాం. ముఖ్యంగా మొదటి కారును కొనుగోలు చేసినప్పుడు ఆలోచిస్తాం. తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న కారు కోసం వెతుకుతాం. మిడిల్ క్లాస్ వాళ్లకు ఈ ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా మీ మొదటి కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, 10 లక్షల కంటే తక్కువ బడ్జెట్‌తో రాబోయే కార్ల గురించి తెలుసుకోండి. 4 రాబోయే కార్ల గురించి చూడండి..
మారుతి సుజుకి డిజైర్
మారుతి సుజుకి త్వరలో తన ప్రసిద్ధ సెడాన్ డిజైర్ కొత్త జనరేషన్‌ను విడుదల చేయబోతోంది. ఇది నవంబర్ 4న భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఇది కొత్త డిజైన్, కొత్త క్యాబిన్, మరిన్ని ఫీచర్లను పొందవచ్చని భావిస్తున్నారు. ఇందులోని కొత్త ఇంజన్ 1.2-లీటర్ Z-సిరీస్ పెట్రోల్ మోటార్‌గా ఉంటుంది. ఇది కొత్త స్విఫ్ట్‌లో కనిపించింది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఎంపికలతో అందిస్తారు. ఇటీవల కొత్త డిజైర్ చిత్రాలు లీక్ అయ్యాయి. ఇది సెగ్మెంట్ మొదటి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆధునిక డిజైన్‌ను పొందబోతున్నట్లు కనిపిస్తోంది.
న్యూ జెన్ హోండా అమేజ్
హోండా అమేజ్ మూడో తరం త్వరలో భారత మార్కెట్లో విడుదల కానుంది. నివేదికలను ప్రకారం.. 2024 చివరి నాటికి దీనిని లాంచ్ చేయవచ్చు. థర్జ్ జనరేషన్ అమేజ్ ఇప్పటికే ఉన్న 1.2-లీటర్ i-VTEC ఇంజన్‌ను పొందే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 90 bhp, 110 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్, CVT గేర్‌బాక్స్‌ల ఆప్షన్స్‌తో రానుంది. హోండా అమేజ్ రెండో తరం మోడల్ 2018 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది 2021లో మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌ను పొందింది
కియా సిరోస్
కియా ప్రస్తుతం భారతీయ మార్కెట్ కోసం కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం పని చేస్తోంది. ఇది సోనెట్, సెల్టోస్ మధ్య ఉండనుంది. దీనిని సైరోస్ అని పిలుస్తారు. దీని ప్రారంభ ధర రూ. 10 లక్షల కంటే తక్కువగా ఉండవచ్చు. ఇది 2025లో లాంచ్ అవుతుందని అంచనా.
స్కోడా కైలాక్
స్కోడా తన అత్యంత ఎదురుచూస్తున్న కైలాక్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. ఇది 6 నవంబర్ 2024న లాంచ్ చేయడానికి షెడ్యూల్ చేశారు. దీనితో పాటు, సబ్-కాంపాక్ట్ SUV విభాగంలో టాటా నెక్సాన్, మహీంద్రా XUV3XO, మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సోనెట్ వంటి ఇతర కార్లతో కంపెనీ పోటీపడుతుంది. స్కోడా కైలాక్ 1.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌ని పొందబోతోంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 114 బీహెచ్పీ మరియు 178 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
పైన చెప్పన కార్లు అన్ని ఎక్స్‌షోరూమ్ ధర రూ.10 లక్షలలోపు ఉంటాయని అంచనా.