Skoda Elroq EV: తాజా డిజైన్ ఫిలాసఫీతో స్కోడా ఎల్రాక్ ఈవీ
Skoda Elroq EV: చెక్ ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా నుంచి మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్యూవీ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కోడా ఎల్రాక్ సింగిల్ చార్జ్ తో 560 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. న్యూ డిజైన్ లో ఇది ఆకట్టుకునేలా ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
(1 / 5)
స్కోడా ఎల్రాక్ ఈవీ గ్లోబల్ లాంచ్ ఇటీవలే జరిగింది. ఈ ఆల్ ఎలక్ట్రిరక్ ఈవీని భారత్ లో వచ్చే ఏడాది మధ్యలో లాంచ్ చేయనున్నారు. స్కోడా ఎల్రాక్ ఈవీ బ్రాండ్ మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్ యూవీగా వస్తుంది. ఎల్రాక్ పూర్తిగా కొత్త డిజైన్ ఫిలాసఫీతో వస్తోంది,
(2 / 5)
ఇతర సమకాలీన స్కోడా కార్లతో పోలిస్తే స్కోడా ఎల్రాక్ ఈవీ తక్కువ లైన్లతో వస్తుంది. ఇది మోడ్రన్ స్లైడ్ డిజైన్ ఫిలాసఫీని కలిగి ఉంది. ఫ్రంట్ ప్రొఫైల్ లో టెక్ డెక్ ఫేస్, హెడ్ ల్యాంప్స్ లో ఆల్ ఎల్ ఈడీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్, వెనుక భాగంలో ఉన్న బ్లాక్ క్లాడింగ్ దాని బోల్డ్ లుక్ ను మెరుగుపరుస్తుంది. స్కోడా తన సిగ్నేచర్ షార్ప్ స్టైలింగ్ ను కొనసాగిస్తుంది.
(3 / 5)
స్కోడా ఎల్రాక్ క్యాబిన్ మినిమలిస్ట్ గా, క్రమబద్ధంగా కనిపిస్తుంది. ఇందులో 13 అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఫిజికల్ బటన్ బార్, ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, లేయర్డ్ డ్యాష్ బోర్డ్ విజువల్ గా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎల్రాక్ క్యాబిన్ స్థలం, సౌకర్యంపై దృష్టి పెడుతుందని స్కోడా పేర్కొంది. ఈ క్యాబిన్ మరో ప్రధాన ఆకర్షణ 1,580 లీటర్ల బూట్ స్పేస్.
(4 / 5)
స్కోడా ఎల్రాక్ స్టాండర్డ్ వెర్షన్, స్పోర్ట్ లైన్ వెర్షన్ లలో లభిస్తుంది. అలాగే, స్కోడా ఈ ఎలక్ట్రిక్ కారు 'ఫస్ట్ ఎడిషన్' అవతార్ ను విడుదల చేయనుంది. వోక్స్వ్ వ్యాగన్ గ్రూప్ ఎంఇబి ప్లాట్ఫామ్ ఆధారంగా, ఎల్రాక్ వివిధ రకాల పవర్ట్రెయిన్ ఎంపికలను పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కోసం మూడు బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి. అవి 55 కిలోవాట్, 63 కిలోవాట్లు, 82 కిలోవాట్.
ఇతర గ్యాలరీలు