తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Senior Citizen Fd : 3 ఏళ్ల ఎఫ్‌డీ చేయాలనుకునే సీనియర్ సిటిజన్స్.. ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పోల్చుకోండి

Senior Citizen FD : 3 ఏళ్ల ఎఫ్‌డీ చేయాలనుకునే సీనియర్ సిటిజన్స్.. ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పోల్చుకోండి

Anand Sai HT Telugu

04 November 2024, 21:30 IST

google News
    • Senior Citizen FD Rates Comparison : ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఈ కాలంలో సురక్షితమైన పెట్టుబడి. చాలా మంది సీనియర్ సిటిజన్స్ వీటివైపు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఏ బ్యాంకులో వడ్డీ రేటు అధికంగా ఉందో తెలుసుకోవాలి. ఎఫ్‌డీ 3 ఏళ్ల కాలానికి ఏ బ్యాంకు ఎక్కువగా వడ్డీ రేటు అందిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
సీనియర్ సిటిజన్స్ ఎఫ్‌డీ రేట్లు
సీనియర్ సిటిజన్స్ ఎఫ్‌డీ రేట్లు (MINT_PRINT)

సీనియర్ సిటిజన్స్ ఎఫ్‌డీ రేట్లు

షేర్లు, మ్యూచువల్ ఫండ్స్.. ఇలా డబ్బును పెంచుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అయినప్పటికీ చాలా మంది ఎఫ్‌డీలపై వైపై మెుగ్గుచూపిస్తారు. ఎందుకంటే ఇది సురక్షితమైన పెట్టుబడి. నేటికీ చాలా మంది డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది సీనియర్ సిటిజన్‌లు తమ పొదుపును పెంచుకోవడానికి సురక్షితమైన, స్థిరమైన మార్గం.

ఎఫ్‌డీ అంటే ఒక రకమైన పొదుపు స్కీమ్. నిర్దిష్ట కాలానికి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలలో డబ్బు డిపాజిట్ చేసుకుంటారు. ఈ వ్యవధిలో డిపాజిట్‌ని ఉపసంహరించుకోలేరు. ఫిక్స్‌డ్ టర్మ్ ముగింపులో స్థిరమైన వడ్డీ రేటును పొందవచ్చు.

ఎఫ్‌డీ ఖాతాను తెరిచిన తర్వాత వడ్డీ రేటు తగ్గించరు. మీకు మెుదట నిర్ణయించిన వడ్డీ రేటును అందుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఎఫ్‌డీ ఖాతాను తెరిచినప్పుడు మీరు నిర్ణీత కాలానికి నిర్దిష్ట వడ్డీ రేటును లాక్ చేసి ఉంటారు. ఆ వ్యవధిలో బ్యాంక్ తన వడ్డీ రేటును తగ్గించదు. సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీలు సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు అదనపు వడ్డీ రేట్లను అందిస్తాయి. సీనియర్ సిటిజన్లు తమ పొదుపును పెంచుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం.

సీనియర్ సిటిజన్లకు రూ. 5 లక్షల పెట్టుబడిపై అత్యధిక రాబడిని అందించే 3 సంవత్సరాల ఎఫ్‌డీ ఏ బ్యాంక్‌లో ఎలా ఉన్నాయో చూద్దాం. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి. సీనియర్ సిటిజన్ ఖాతాల కోసం బ్యాంకులు వివిధ వడ్డీ చెల్లింపు ఆప్షన్స్ అందిస్తాయి. వీటిని ఎంచుకోవడం ద్వారా, సీనియర్ సిటిజన్లు వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వడ్డీని పొందవచ్చు. నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన వడ్డీని పొందే వివిధ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు.

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 సంవత్సరాల పాటు రూ.5 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, మీకు 7.25 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.

3 సంవత్సరాల పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీ ఖాతాకు 7.50 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో మూడు సంవత్సరాల పాటు సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీ ఖాతాను తెరవాలనుకుంటే 7.50 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్లు మూడేళ్ల కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో రూ. 5 లక్షల పెట్టుబడిపై రూ. 6,20,273 పొందవచ్చని అంచనా. 3 సంవత్సరాలకు పీఎన్‌బీలో రూ. 5 లక్షల పెట్టుబడి సుమారు రూ. 6,24,858 వస్తుంది. 7.5 శాతం వడ్డీ రేటుతో హెచ్‌డీఎఫ్‌సీలో 5 లక్షల పెట్టుబడిపై రూ. 6,24,858గా వస్తుంది.

సీనియర్ సిటిజన్లు ఏ బ్యాంక్ 3 సంవత్సరాల ఎఫ్‌డీ రూ. 5 లక్షల పెట్టుబడిపై అత్యధిక రాబడిని అందిస్తుందో తెలుసుకోవాలి. కావాలంటే మీరు బ్యాంకుల వెబ్‌సైట్‌ను కూడా చెక్ చేయవచ్చు.

తదుపరి వ్యాసం