FD Interest Rate : 5 సంవత్సరాల ఎఫ్‌డీని ఒక ఏడాదిలోపు విత్ డ్రా చేసుకుంటే వడ్డీ వస్తుందా?
FD Interest Rate : ఎఫ్‌డీలలో ఇన్వెస్ట్ చేయడం సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు. దీని వలన చాలా లాభాలు ఉన్నాయి. కానీ చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూర్ అవ్వకముందే ఉపసంహరించుకుంటారు. ఇలా చేస్తే వడ్డీ వస్తుందా?
ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది పెట్టుబడికి సురక్షితమైనదిగా చూస్తారు. మీరు ఎఫ్‌డీలో హామీతో కూడిన రాబడిని కూడా పొందుతారు. అదే సమయంలో నిపుణులు కూడా ఎఫ్‌డీలో చేరాలని సిఫార్సు చేస్తున్నారు. చాలా మంది ఐదేళ్ల పాటు బ్యాంకు ఎఫ్‌డీలో జాయిన్ అవుతారు. కానీ కొన్ని కారణాలతో ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఎఫ్‌డీ నుండి డబ్బును విత్‌డ్రా చేస్తుంటారు. ఇలా చేయవలసి వస్తే ఈ కేసులో మీకు వడ్డీ లభిస్తుందా లేదా?
ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఇప్పటికీ చాలామంది ఇష్టపడుతున్నారు. ఏళ్ల తరబడి ఫిక్స్‌డ్ డిపాజిట్లను నమ్ముతుంటారు. మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇందులో మార్కెట్ ప్రభావం ఉండదు. ఎఫ్‌డీకి సంబంధించిన అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇందులో మీకు ప్రీ మెచ్యూర్ ఉపసంహరణ ఆప్షన్ కూడా ఇస్తారు. దీని ద్వారా మీరు ఎఫ్‌డీ వ్యవధి పూర్తయ్యేలోపు అవసరమైతే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇలా చేయడం వల్ల డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ వస్తుందా లేదా అనేది చాలా మందికి ఉన్న ప్రశ్న.
5 సంవత్సరాల ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టినవారు చాలా మంది కొన్ని అవసరాలతో ముందుగానే డబ్బులు విత్ డ్రా చేస్తారు. ఎఫ్‌డీలో మీకు ఇచ్చిన ప్రీ మెచ్యూర్ ఉపసంహరణతో రెట్టింపు నష్టం. మీకు తక్కువ వడ్డీ లభిస్తుంది. దీంతో పాటు పెనాల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెనాల్టీ 0.5 శాతం నుండి 1.0 శాతం వరకు ఉంటుంది.
ఇది కాకుండా బ్యాంక్ మీకు బుక్ చేసిన రేటుపై కాకుండా కార్డ్ రేటుపై వడ్డీని ఇస్తుంది. మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో డబ్బును డిపాజిట్ చేసే రేటును బుక్డ్ రేట్ అంటారు. కార్డ్ రేటు కింద ఆ కాలానికి నిర్ణయించిన వడ్డీని బ్యాంక్ మీకు అందిస్తుంది. ఒక సంవత్సరం పూర్తయిన వెంటనే మీరు 5 సంవత్సరాల ఎఫ్‌డీని బ్రేక్ చేస్తే.. మీకు 1 సంవత్సరంలో ఇచ్చే వడ్డీ మొత్తం. దాని ఆధారంగానే వడ్డీ ఇస్తారు. మరోవైపు పెనాల్టీ కూడా ఉంటుంది. అందుకే ఎఫ్‌డీలను మెచ్యూర్ అయ్యేదాకా ఉండనివ్వాలి.