Fixed Deposit : ఎస్బీఐలో రూ.6లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఎంత తిరిగి వస్తుంది?-know sbi senior citizen fixed deposit plans returns on 6 lakh rupees and 12 lakhs ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fixed Deposit : ఎస్బీఐలో రూ.6లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఎంత తిరిగి వస్తుంది?

Fixed Deposit : ఎస్బీఐలో రూ.6లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఎంత తిరిగి వస్తుంది?

Anand Sai HT Telugu

Fixed Deposit : చాలా మంది స్థిరమైన ఆదాయం కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం చూస్తుంటారు. ఎస్బీఐలో 6 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఎఫ్‌డీలో ఎంత తిరిగి వస్తుందో చూద్దాం..

ఫిక్స్‌డ్ డిపాజిట్లు

సీనియర్ సిటిజన్లకు పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం అవసరం. రిటైర్‌మెంట్‌ తర్వాత ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ అవసరానికి అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను అందిస్తుంది. ఇది సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే భద్రత, అధిక వడ్డీ రేట్లను ఇస్తుంది.

అమృత్ వృష్టి, అమృత్ కలాష్ వంటి ఎస్బీఐ అందించే ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు ఉన్నాయి. ఇది కాకుండా 1 సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్, 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్, 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి వివిధ ఎఫ్‌డీ పథకాలను కూడా అందిస్తుంది. రూ.6 లక్షల పెట్టుబడిపై ఎంత తిరిగి వస్తుందో చూద్దాం..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 444 రోజుల మెచ్యూరిటీ వ్యవధితో అమృత్ వృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7.25 శాతం, 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7.50శాతంగా ఉంది. అమృత్ వృష్టి పథకంలో రూ. 6 లక్షలు, రూ. 12 లక్షలు, రూ. 18 లక్షలు పెట్టుబడి పెడితే ఎలా వడ్డీ వస్తుందో చూద్దాం..

ఎస్‌బీఐ అమృత్ వృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో 7.75 శాతం వడ్డీ రేటుతో రూ.6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, మీకు రూ.58,722.25 వడ్డీ లభిస్తుంది. దీంతో మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ.6,58,722.25 అవుతుంది.

7.75 శాతం వడ్డీ రేటుతో అమృత్ వృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కింద రూ. 12 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. దీనితో వడ్డీ రూ.1,17,444.50 అవుతుంది. దీని ద్వారా 444 రోజుల తర్వాత రూ.13,17,444.50 పొందవచ్చు.

అమృత్ వృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో 7.75 శాతం వడ్డీ రేటుతో రూ.18 లక్షలు పెట్టుబడి పెడితే.. రూ.1,76,166.76 వడ్డీ దొరుకుతుంది. ఇది మెచ్యూరిటీ మొత్తం రూ.19,76,166.76గా తిరిగి వస్తుంది.