FD Interest Rate : ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటే ఈ ఐదు బ్యాంకుల వడ్డీ రేట్లను ఓసారి చూడండి-fixed deposit interest rate increase 5 banks revised the percentage know details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fd Interest Rate : ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటే ఈ ఐదు బ్యాంకుల వడ్డీ రేట్లను ఓసారి చూడండి

FD Interest Rate : ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటే ఈ ఐదు బ్యాంకుల వడ్డీ రేట్లను ఓసారి చూడండి

Anand Sai HT Telugu
Sep 26, 2024 09:30 AM IST

FD Interest Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్లు అనేవి దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇచ్చేవి. భవిష్యత్తు కోసం చాలా మంది వీటిలో పెట్టుబడులు పెడతారు. అయితే ఎక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకులను ఎంచుకుంటే మరింత లాభం ఉంటుంది. అలాంటి బ్యాంకులు ఏమున్నాయో చూద్దాం..

ఫిక్స్‌డ్ డిపాజిట్లు
ఫిక్స్‌డ్ డిపాజిట్లు

ఆర్థిక భద్రత కోసం ప్రతి ఒక్కరూ ఆధారపడే పెట్టుబడి పద్ధతి ఫిక్స్‌డ్ డిపాజిట్లు. ఈ పెట్టుబడులపై చాలామంది మరింత ఎక్కువగా ఆధారపడతారు. ఎందుకంటే మెరుగైన రాబడిని పొందగలరు. రిస్క్‌ కూడా ఎక్కువగా ఉండదు. ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టినప్పుడు మంచి మొత్తం వస్తుంది. అయితే వడ్డీ రేట్లను కూడా చూసుకోవాలి.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు సాధారణ పొదుపు ఖాతాలపై స్థిరమైన వడ్డీ రేటును అందిస్తాయి. మీరు పెట్టుబడి సమయంలో దీని వడ్డీ రేటును నిర్ణయించవచ్చు. పెట్టుబడి వ్యవధిలో ఇది మారకుండా ఉంటుంది. పెట్టుబడిదారులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా తదనుగుణంగా ఆర్థికంగా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బ్యాంకులు సెప్టెంబర్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించాయి. ఏయే బ్యాంకులు అలాంటి మార్పులను తీసుకొచ్చాయో చూద్దాం.

ఇండస్ఇండ్ బ్యాంక్

ఇండస్‌ఇండ్ బ్యాంక్ సాధారణ పౌరులకు కొన్ని ఆఫర్‌లను అందిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 3.5శాతం నుండి 7.99శాతం వరకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుండి 8.25శాతం వరకు వడ్డీ రేట్లు అందిస్తుంది. ఈ రేట్లు 11 సెప్టెంబర్ 2024 నుండి వర్తిస్తాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ ప్రజలకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాల వ్యవధిలో 4.25 శాతం నుండి 7.30 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు కూడా 4.75 శాతం నుండి 7.80 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తారు. ఈ రేట్లు 5 సెప్టెంబర్ 2024 నుండి వర్తిస్తాయి.

ఫెడరల్ బ్యాంక్

ఫెడరల్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధికి 3 శాతం నుండి 7.40 శాతం వరకు స్థిర డిపాజిట్ వడ్డీ రేట్లకు హామీ ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం నుండి 7.90 శాతం వరకు వడ్డీ రేట్లు అందిస్తాయి. ఈ రేట్లు 16 సెప్టెంబర్ 2024 నుండి వర్తిస్తాయి.

యాక్సిస్ బ్యాంక్

యాక్సిస్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 3 శాతం నుండి 7.25 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు హామీ ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం నుండి 7.75 శాతం వరకు వడ్డీ రేట్లు అందిస్తారు. ఈ రేట్లు 10 సెప్టెంబర్ 2024 నుండి వర్తిస్తాయి.

కర్ణాటక బ్యాంక్

కర్నాటక బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాల వ్యవధిలో 3.5 శాతం నుండి 7.50 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు సాధారణ రేటు కంటే 0.25 శాతం ఎక్కువ వడ్డీని పొందుతారు.