తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung: పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23+ లాంచ్: పూర్తి వివరాలివే

Samsung: పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23+ లాంచ్: పూర్తి వివరాలివే

02 February 2023, 18:28 IST

google News
    • Samsung Galaxy S23, Galaxy S23+: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23, సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23+ మొబైళ్లు స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉన్నాయి. ఫ్లాగ్‍షిప్ లెన్స్ కెమెరాలతో వస్తున్నాయి.
Samsung: పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23+ లాంచ్ (Photo: Samsung)
Samsung: పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23+ లాంచ్ (Photo: Samsung)

Samsung: పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23+ లాంచ్ (Photo: Samsung)

Samsung Galaxy S23, Galaxy S23+: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‍లో మూడు ఫ్లాగ్‍షిప్ మొబైళ్లు లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‍లో గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడల్‍తో పాటు సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23+ ఫోన్లు కూడా క్వాల్కామ్ లేటెస్ట్ పవర్‍‍ఫుల్ ప్రాసెసర్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2తో వస్తున్నాయి. డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‍ప్లేలను కలిగి ఉన్నాయి. అన్‍ప్యాక్డ్ ఈవెంట్ ద్వారా ఈ ఫ్లాగ్‍షిప్ సిరీస్‍ను సామ్‍సంగ్ తీసుకొచ్చింది. గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23+ వెనుక మూడు ఫ్లాగ్‍షిప్ కెమెరాల సెటప్ ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్స్ రేటింగ్ కూడా ఉంటుంది. Samsung Galaxy S23, Samsung Galaxy S23+ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 స్పెసిఫికేషన్లు

Samsung Galaxy S23 Specifications: 6.1 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ డైనమిక్ అమోలెడ్ డిస్‍ప్లే 2X డిస్‍ప్లేను సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 మొబైల్ వస్తోంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్, గొరిల్లాగ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది. క్వాల్‍కామ్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్‍ యూఐ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‍తో అందుబాటులోకి వస్తోంది.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. 5జీ కనెక్టివిటీ సపోర్ట్ ఉంటుంది.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్‍లో 3,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ల వైర్డ్, 15 వాట్ల వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23+ స్పెసిఫికేషన్లు

Samsung Galaxy S23+ Specifications: 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే 6.6 ఫుల్ హెచ్‍డీ+ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‍ప్లేను సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23+ కలిగి ఉంది. డిస్‍ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫోన్‍ కూడా స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్‍యూఐ 5.1తో లాంచ్ అయింది. గెలాక్సీ ఎస్23+ వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాలు ఉంటాయి. 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. కెమెరాల విషయంలో ఎస్23, ఎస్23+ ఒకే విధంగా ఉన్నాయి.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23+ మొబైల్‍లో రూ.4,700mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ల వైర్డ్, 15 వాట్ల వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. వైర్లెస్ పవర్ షేరింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. 5జీ, 4జీ LTE, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, NFC కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23, సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23+ ధరలు

Samsung Galaxy S23 Price: 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్న సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 బేస్ వేరియంట్ ధర రూ.74,999, 8GB ర్యామ్+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23+ 8GB ర్యామ్+256GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.94,999, 8GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,04,999గా ఉంది. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ప్రారంభ ధర రూ.1,24,999గా ఉంది. ఈ నెల 17వ తేదీన సామ్‍సంగ్ అధికారిక వెబ్‍సైట్, ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్‍లు, ఆఫ్‍లైన్ మార్కెట్లలో సేల్‍కు వస్తుంది.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా వెనుక 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన నాలుగు కెమెరాల సెటప్ ఉంటుంది. 6.8 ఇంచుల క్వాడ్ హెచ్‍డీ+ డిస్‍ప్లేను కలిగిఉంటుంది.

తదుపరి వ్యాసం