తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bike For Youth : యువత కోసమే ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​- స్టైలిష్​ డిజైన్​, అదిరే పర్ఫార్మెన్స్​..

Bike for youth : యువత కోసమే ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​- స్టైలిష్​ డిజైన్​, అదిరే పర్ఫార్మెన్స్​..

Sharath Chitturi HT Telugu

23 November 2024, 6:49 IST

google News
    • Royal Enfield Scram 440 : రాయల్ ఎన్​ఫీల్డ్ స్క్రామ్ 440 ను మోటోవర్స్ 2024 లో ఆవిష్కరించింది. ఈ బైక్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
రాయల్ ఎన్​ఫీల్డ్ కొత్త బైక్​..
రాయల్ ఎన్​ఫీల్డ్ కొత్త బైక్​..

రాయల్ ఎన్​ఫీల్డ్ కొత్త బైక్​..

రాయల్ ఎన్​ఫీల్డ్​ మోటోవర్స్ 2024 లో కొత్త స్క్రామ్ 440ని విడుదల చేసింది. కొత్త రాయల్ ఎన్​ఫీల్డ్​ స్క్రామ్ 440 స్క్రామ్ 411 ఆధారిత అప్​డేటెడ్​ వెర్షన్. ఈ బైక్ పెద్ద ఇంజిన్, ఎక్కువ శక్తి, ఎక్కువ ఫీచర్లు, కొత్త కలర్​ ఆప్షన్స్​ని పొందుతుంది. ఇది ఆర్​ఈ  బైక్స్​లో 411 సీసీ డిస్​ప్లేస్​మెంట్​కు ముగింపును సూచిస్తుంది! అయితే మోటార్ అప్​గ్రేడ్ అవతారంలో స్క్రామ్ 440లో కొనసాగుతుంది.

కొత్త రాయల్ ఎన్​ఫీల్డ్​ స్క్రామ్ 440 పాత స్క్రామ్ 411 నుంచి ఛాసిస్​ని నిలుపుకుంటుంది. రేర్ సబ్ ఫ్రేమ్ మరింత లోడ్ బేరింగ్ లక్షణాల కోసం సవరించడం జరిగింది. మెరుగైన దృఢత్వం కోసం ఇప్పుడు కొత్త స్టీల్​తో తయారు చేశారు. స్టైలింగ్ అలాగే ఉంది కానీ కొత్త ఎల్ఈడీ హెడ్​ల్యాంప్, ఇండికేటర్ల రూపంలో అప్​గ్రేడ్స్​ ఉన్నాయి. రాయల్ ఎన్​ఫీల్డ్​స్క్రామ్ 440 బైక్​ని ఫోర్స్ బ్లూ, ఫోర్స్ టీల్, ఫోర్స్ గ్రే, ట్రయల్ గ్రీన్, ట్రయల్ బ్లూ అనే ఐదు కొత్త కలర్ ఆప్షన్లలో అందిస్తోంది.

బైక్​లో వైర్-స్పోక్డ్ వీల్స్ కూడా ఉన్నాయి. వినియోగదారులు ఇప్పుడు అల్లాయ్ వీల్స్​ని కూడా ఎంచుకునే అవకాశం ఉంది. 19 ఇంచ్​ ఫ్రంట్, 17 ఇంచ్​ రేర్ వీల్ సెటప్ డ్యూయల్ పర్పస్ టైర్లతో పనిచేస్తాయి. గ్రౌండ్ క్లియరెన్స్ 200 ఎంఎం, సీటు హైట్​ 200 ఎంఎం. స్క్రామ్ 440లో టైప్-ఏ యూఎస్బీ ఛార్జర్, పాత మోడల్ మాదిరిగానే డిజిటల్-అనలాగ్ క్లస్టర్ ఉంటాయి. నావిగేషన్ కోసం ట్రిప్పర్ పాడ్ ఆప్షనల్ యాడ్-ఆన్​గా అందుబాటులో ఉంది.

రాయల్ ఎన్​ఫీల్డ్​ స్క్రామ్ 440: పవర్ అండ్ పర్ఫార్మెన్స్

సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, 443 సీసీ ఇంజిన్​ వస్తుంది ఈ కొత్త బైక్​. దీన్ని ఒరిజినల్ హిమాలయన్/స్క్రామ్ 411 లాంగ్-స్ట్రోక్ ఇంజిన్ ఆధారంగా రూపొందించడం జరిగింది. ఈ ఇంజిన్ ఇప్పుడు 25.4 బీహెచ్​పీ పవర్, 34 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. ఇది పాత స్క్రామ్ 411 కంటే ప్రధాన అప్​గ్రేడ్.

రాయల్ ఎన్​ఫీల్డ్​ స్క్రామ్ 440:

సస్పెన్షన్ సెటప్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ అబ్సార్బర్స్​ ఉన్నాయి. బ్రేకింగ్ పనితీరును 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్, 240 ఎంఎం రేర్ డిస్క్​తో అప్​గ్రేడ్ చేశారు. స్క్రామ్ 440 బరువు 187 కిలోలు. ఈ బైక్ ఇప్పుడు సెంటర్ స్టాండ్​తో వస్తుంది. రాయల్ ఎన్​ఫీల్డ్ కొత్త స్క్రామ్ 440ని జనవరి 2025 లో మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. పాత మోడల్ కంటే స్వల్పంగా ధరల పెంపు ఉంటుందని భావిస్తున్నారు.

తదుపరి వ్యాసం