New bike launch : యువతకు పిచ్చెక్కించే ‘రెట్రో’ లుక్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ లాంచ్..
కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650ని సంస్థ లాంచ్ చేసింది. ఈ మోడల్ ధర, ఫీచర్స్, ఇంజిన్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ మంచి జోరు మీద ఉంది! సంస్థకు చెందిన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ని ఆవిష్కరించిన రాయల్ ఎన్ఫీల్డ్, తాజాగా కొత్త బైక్‌ని లాంచ్ చేసింది. దీని పేరు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650. అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన కొన్ని రోజులకే ఈ మోడల్ ఇండియాలోనూ అడుగుపెట్టింది. ఆర్ఈ ఇంటర్‌సెప్టర్ 650 ఆధారిత స్క్రాంబ్లర్ తరహా ఆఫర్ అయిన దీని ధర రూ .3.39 లక్షల నుంచి రూ .3.59 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కొత్త బేర్ 650.. 650సీసీ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన 5వ మోటార్ సైకిల్. ఈ నేపథ్యంలో ఈ బైక్ వివరాలను ఇక్కడ చూసేయండి..
రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 డిజైన్..
రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 డిజైన్.. 1960-70ల్లో స్క్రాంబ్లర్ల నుంచి స్ఫూర్తి పొందినట్టు అనిపిస్తుంది.సైడ్ ప్యానెల్స్‌పై కొత్త పెయింట్ స్కీమ్, స్క్రాంబ్లర్ తరహా సీటు, నంబర్ బోర్డు ఇందులో ఉన్నాయి. డ్యూయెల్ పర్పస్ ఎంఆర్ఎఫ్ నైలోరెక్స్ టైర్లతో 19 ఇంచ్ ఫ్రంట్, 17 ఇంచ్ రేర్ వైర్ స్పోక్డ్ వీల్స్‌తో, ఆల్-ఎల్ఈడీ లైటింగ్‌కు ఈ బైక్ అప్‌గ్రేడ్ అయ్యింది.
రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 హార్డ్‌వేర్..
రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650.. 43ఎంఎం షోవా యూఎస్డీ ఫ్రంట్ ఫోర్కులతో సహా అప్‌గ్రేడెడ్ హార్డ్‌వేర్‌ని పొందుతుంది. వెనుక భాగంలో 115 ఎంఎం ప్రమాణంతో కొత్త ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ 184 ఎంఎం, సీటు ఎత్తు 830 ఎంఎం వరకు పెరిగింది. ఇది ఉన్న అన్ని 650 ఆప్షన్స్‌లోనూ ఎత్తైనది. ఫ్రంట్ బ్రేక్ డిస్క్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 లోని దాని కంటే 320 ఎంఎం పెద్దదిగా ఉంది. ఈ బైక్ స్విచ్చెబుల్ డ్యూయెల్-ఛానల్ ఏబీఎస్ను పొందుతుంది. అయితే కొత్త హిమాలయన్ నుంచి ఇన్-బిల్ట్ నేవిగేషన్ సిస్టమ్‌తో ఫుల్-కలర్ టీఎఫ్టీ స్క్రీన్‌ని తీసుకొచ్చింది సంస్థ.
రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 ఇంజిన్..
ఈ బైక్‌లోని 648 సీసీ ప్యారలెల్-ట్విన్ ఇంజిన్ 7,150 ఆర్పీఎం వద్ద 47 బీహెచ్పీ పవర్‌ని, 5150 ఆర్పీఎం వద్ద 57 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని జనరేట్ చేస్తుంది. దీన్ని 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేసింది సంస్థ. బైక్ బరువును తగ్గించడానికి సహాయపడే కొత్త టూ-టు-వన్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కూడా ఈ బైక్ పొందుతుంది. బేర్ 650 కెర్బ్ బరువు 216 కిలోలు! ఇంటర్‌సెప్టర్ కంటే 2 కిలోలు తక్కువ.
కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650కు ప్రత్యక్ష ప్రత్యర్థి లేదు. ఈ మోటార్ సైకిల్ ఆర్ఈ డీలర్‌షిప్‌ల వద్ద లభిస్తుంది. కొన్ని రోజుల్లో డెలివరీలు ప్రారంభమవుతాయి. కొత్త ఫ్లయింగ్ ఫ్లీ సీ6, హిమాలయన్ ర్యాలీ, మరిన్ని మోటార్ సైకిళ్లతో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ ఈ సంవత్సరం ఈఐసీఎంఏలో బేర్ 650ని కూడా ఒక ముఖ్యమైన ప్రదర్శనగా ఉంచింది.
సంబంధిత కథనం