తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield New Bike : రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి మరో 650 సీసీ బైక్​- త్వరలోనే లాంచ్​!

Royal Enfield new bike : రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి మరో 650 సీసీ బైక్​- త్వరలోనే లాంచ్​!

Sharath Chitturi HT Telugu

20 October 2024, 13:41 IST

google News
    • Royal Enfield Interceptor Bear 650 : రాయల్ ఎన్​ఫీల్డ్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​! ఈ సంస్థ నుంచి మరో 650 సీసీ బైక్​ లాంచ్​కు రెడీ అవుతోంది. దీని పేరు రాయల్ ఎన్​ఫీల్డ్​ ఇంటర్సెప్టర్ బేర్ 650. ఈ బైక్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త 650 బైక్​.. ఇదిగో!
రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త 650 బైక్​.. ఇదిగో! (Facebook/Alza Guild)

రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త 650 బైక్​.. ఇదిగో!

రాయల్ ఎన్​ఫీల్డ్​ తన 650 సీసీ శ్రేణి మోటార్ సైకిళ్లపై ఇటీవల ఎక్కువగా దృష్టి సారించింది. కంపెనీ ప్రస్తుతం ఈ సెగ్మెంట్​లో నాలుగు ఆఫర్లను కలిగి ఉంది. అనేక కొత్త లాంచ్​లతో లైనప్​ని మరింత విస్తరించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 650, బుల్లెట్ 650 బైక్స్​పై కంపెనీ పనిచేస్తోందని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో 650 సీసీ బైక్​ని సంస్థ రెడీ చేస్తోందని సమాచారం. ఇటీవల బయటకు వచ్చిన స్పై షాట్స్​ ప్రకారం. న్​ఫీల్డ్​ ఇంటర్​సెప్టర్​ బేర్ 650 బైక్​ త్వరలో మార్కెట్​లోకి అడుగుపెట్టనుంది.

ఈ ఏడాది ఈఐసీఎంఏలో అడుగుపెట్టనున్న ఈ బ్రాండ్ ఇప్పటికే ఇంటర్​సెప్టర్​ బేర్ 650 కోసం డిజైన్ పేటెంట్, నేమ్ ప్లేట్ పేటెంట్​ని భారత్​లో దాఖలు చేసింది. ఈ మోటార్ సైకిల్ ఈ ఏడాది చివర్​లో మోటోవర్స్​లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాయల్ ఎన్​ఫీల్డ్​ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్​సైకిల్​ని కూడా ఈఐసీఎంఎ 2024లో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది.

రాయల్​ ఎన్​ఫీల్డ్ ఇంటర్​సెప్టర్ బేర్ 650..

రాయల్ ఎన్​ఫీల్డ్ ఇంటర్​సెప్టర్ బేర్ 650 తన ఛాసిస్​ను ఇంటర్​సెప్టర్ 650 తో పంచుకోనుంది. ఏదేమైనా, కొత్త మోటార్ సైకిల్ వెనుక స్ప్రింగ్స్ మెరుగైన ప్రయాణాన్ని అందించడానికి ఉపయోగపడతాయి. ముందు భాగంలో ఇన్వర్టెడ్​ ఫోర్కులతో భర్తీ చేసింది సంస్థ. సస్పెన్షన్ సిస్టమ్ ఖచ్చితమైన ట్యూనింగ్ కోసం రాయల్ ఎన్​ఫీల్డ్ షోవాతో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. స్క్రాంబ్లర్​ కావడంతో ఈ మోటార్ సైకిల్​లో స్పోక్డ్ వీల్స్, డ్యూయెల్ పర్పస్ టైర్లు ఉన్నాయి.

రాయల్ ఎన్​ఫీల్డ్ ఇంటర్​సెప్టర్ బేర్ 650 ఇతర రాయల్ ఎన్​ఫీల్డ్ 650 సీసీ బైక్స్​తో సమానమైన అనేక ఇతర అంశాలను కలిగి ఉండొచ్చు. ఉదాహరణకు ఎల్ఈడీ హెడ్​లైట్లు ప్రస్తుతం బ్రాండ్ నుంచి ఇతర 650 సీసీ బైక్స్​లో కనిపించే మాదిరిగానే ఉంటాయి. టర్న్ ఇండికేటర్లు కూడా హిమాలయన్ 450 మాదిరిగానే డిజైన్​ని పంచుకుంటాయి. హిమాలయన్ 450కి భిన్నంగా బేర్ 650లో వృత్తాకార ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్​ని అమర్చారు. బాడీవర్క్ మినిమలిస్టిక్​గా డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కొత్త సైడ్ ప్యానెల్ కూడా ఉంటుంది.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ ఇంజిన్​..

ఇంటర్​సెప్టర్ బేర్ 650లో 648 సీసీ, ఎయిర్ ఆయిల్ కూల్డ్ పారలెల్​ ట్విన్ సిలిండర్​ ఇంజిన్, 270 డిగ్రీల క్రాంకాషాఫ్ట్ ఉంటుంది. ఈ ఇంజిన్ సుమారుగా 47బీహెచ్​పీ పవర్, 52ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్మూత్-షిఫ్టింగ్ 6-స్పీడ్ ట్రాన్స్​మిషన్​తో కనెక్ట్​ చేసే అవకాశం ఉంది. రాయల్ ఎన్​ఫీల్డ్ ఇంటర్​సెప్టర్​ బేర్ 650 బైక్​ కోసం వేరే స్ప్రాకెట్ సైజ్​ని ఉపయోగించే అవకాశం ఉంది. అదనంగా, ఒక కొత్త సింగిల్-సైడ్ ఎగ్జాస్ట్ కూడా రావొచ్చు. అయితే, సింగిల్ సైడ్ డిజైన్ గణనీయంగా తేలికగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం డ్యూయెల్ ఎగ్జాస్ట్​ల బరువు 10 కిలోలకు చేరువలో ఉంది.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఇంటర్​సెప్టర్​ 650 లాంచ్​, ధర, మైలేజ్​తో పాటు ఇతర వివరాలపై త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం