Royal Enfield Classic 350 : 2024 రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 బుకింగ్స్​ షురూ..-new royal enfield classic 350 booking and test rides begin today ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield Classic 350 : 2024 రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 బుకింగ్స్​ షురూ..

Royal Enfield Classic 350 : 2024 రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 బుకింగ్స్​ షురూ..

Sharath Chitturi HT Telugu
Sep 02, 2024 09:58 AM IST

2024 రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 ఇటీవలే మార్కెట్​లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ బైక్​ బుకింగ్స్​, టెస్ట్​ రైడ్స్​ మొదలయ్యాయి. ధరలతో పాటు ఈ బైక్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

024 రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350
024 రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350

రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350 అప్డేటెడ్ వర్షెన్​ని పొందింది. ఇది ఆగస్టు 31న భారతదేశంలో లాంచ్ అయింది. రెట్రో థీమ్ పాపులర్ మోటార్ సైకిల్ అప్​డేటెడ్ వర్షెన్​ కొత్త కలర్ స్కీమ్​లు, అప్​గ్రేడెడ్ ఫీచర్లతో వస్తుంది. అయితే, మెకానిక్స్​ పరంగా మాత్రం ఎలాంటి మార్పు లేదు. రూ .1.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదలైన ఈ మోటార్ సైకిల్ ధర రూ .2.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది, కొత్త క్లాసిక్ 350.. జావా 350, హోండా సీబీ350లతో ఉన్న పోటీని మరింత పెంచింది.

2024 రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350 బుకింగ్స్​ మొదలయ్యాయి. బైక్​ని టెస్ట్​ రైడ్​ కూడా చేయొచ్చు! బుకింగ్స్​తో పాటు టెస్ట్ రైడ్స్​ని కూడా సంస్థ ప్రారంభించింది.

2024 రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350: వేరియంట్లు..

2024 రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350 హెరిటేజ్, హెరిటేజ్ ప్రీమియం, సిగ్నల్స్, డార్క్, క్రోమ్ అనే ఐదు విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైక్ ధర రూ .1.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ .2.30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఆగస్టు 12న ఆవిష్కరించిన ఈ మోటార్ సైకిల్ ధరను ఆగస్టు 31న సంస్థ ప్రకటించింది.

2024 రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350: కలర్స్

2024 రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350 వివిధ రకాల కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. హెరిటేజ్ మద్రాస్ రెడ్, జోధ్​పూర్ బ్లూ, హెరిటేజ్ ప్రీమియం మెడలియన్ బ్రాంజ్​, సిగ్నల్స్ కమాండో శాండ్​లో లభిస్తాయి. డార్క్ వేరియంట్ గన్ గ్రే, స్టెల్త్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. టాప్-ఆఫ్-లైన్ క్రోమ్ వేరియంట్ ఎమరాల్డ్ గ్రీన్​లో లభిస్తుంది.

2024 రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350: ఫీచర్లు

కొత్త రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350 రెట్రో లుక్​తో కొనసాగుతోంది. కొన్ని ఆధునిక ఫీచర్లను జోడించినప్పటికీ, మోటార్ సైకిల్ దాని ట్రెడీషనల్​ డిజైన్​ని కొనసాగిస్తుంది. ఈ బైక్​ అనలాగ్ స్పీడోమీటర్ కింద ఎల్సీడీ, ఎల్​ఈడీ హెడ్​లైట్, ఎల్​ఈడీ పైలట్ ల్యాంప్స్, గేర్ పొజిషన్ ఇండికేటర్, అప్​గ్రేడ్​ చేసిన టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్​ని పొందుతుంది. టాప్ వేరియంట్లు ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, అడ్జెస్టెబుల్ క్లచ్, బ్రేక్ లివర్లు, ఎల్​ఈడీ ఇండికేటర్స్ వంటి అదనపు ప్రామాణిక ఫీచర్లను అందిస్తాయి.

2024 రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350: ఇంజిన్​..

2024 రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350 బైక్ 349 సీసీ జె సిరీస్ ఎయిర్-ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్​తో వస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్​బాక్స్​తో కనెక్ట్​చేసి ఉంటుంది. ఈ బైక్​ 6,100 ఆర్​పీఎమ్ వద్ద 20.2 బీహెచ్​పీ పవర్, 4,000 ఆర్​పీఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, 2024 రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350 మెకానికల్ ఫ్రంట్ విషయానికి వస్తే మునుపటి మాదిరిగానే ఉంటుంది.

ఆఫర్స్​తో పాటు మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మీ సమీపంలోని రాయల్​ ఎన్​ఫీల్డ్​ డీలర్​షిప్​ షోరూమ్​ని సందర్శించాల్సి ఉంటుంది.

సంబంధిత కథనం