తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రాయల్ ఎన్‌ఫీల్డ్‌ లవర్స్‌కు పిచ్చెక్కించే న్యూస్.. 350సీసీలో అదిరిపోయే లుక్‌తో కొత్త బైక్

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ లవర్స్‌కు పిచ్చెక్కించే న్యూస్.. 350సీసీలో అదిరిపోయే లుక్‌తో కొత్త బైక్

Anand Sai HT Telugu

14 November 2024, 11:00 IST

google News
    • Royal Enfield Goan Classic 350CC : రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు భారతీయ మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ఈ బైక్‌ను యూత్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొత్తగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350సీసీలో బైక్ లాంచ్ కానుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కొత్త బైక్
రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కొత్త బైక్

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కొత్త బైక్

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ భారత మార్కెట్లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. గత నెలలో అంటే 2024 అక్టోబర్‌లో కంపెనీ లక్షకు పైగా వాహనాలను విక్రయించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద అమ్మకాలు కూడా. అందుకే కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తుంది. కొత్త మోడళ్లను తీసుకువస్తుంది. నవంబర్ చివరి నాటికి కంపెనీ తన ఐదో ఉత్పత్తి గోవాన్ క్లాసిక్ 350ను లాంచ్ చేయనుంది.

మీటియోర్, క్లాసిక్, హంటర్, బుల్లెట్ తరువాత జె-సిరీస్ ఇంజన్ ప్లాట్‌ఫామ్ విడుదల చేయనుంది. నవంబర్ 23న లాంచ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. గోవాన్ క్లాసిక్.. బాబర్ స్టైల్ మోటార్ సైకిల్‌లాంటిది. ఇది క్లాసిక్ 350తో వస్తుంది.

గోవాన్ క్లాసిక్ మిగిలిన ఆర్ఈ 350 మాదిరిగానే 349 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఇది గరిష్టంగా 20బిహెచ్‌పీ పవర్, 27 ఎన్ఎమ్ టార్క్‌ను కలిగి ఉంటుంది. గోవాన్ క్లాసిక్ మెయిన్ ఫ్రేమ్ కూడా క్లాసిక్ 350 మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. స్టైలింగ్, పెయింట్ ఆప్షన్లు, రైడింగ్ పొజిషన్లలో తేడాలు ఉండే ఛాన్స్ ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ 350సీసీ.. జావా 42 బాబర్‌‌లాగా సింగిల్ సీటుతోపాటుగా వెనుక సీటు కొంత కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఇంకొకరిని తీసుకెళ్లేందుకు రైడర్ స్కూప్డ్-అవుట్ సీటుపై ఫ్రేమ్ ఉంచుతారు. ఈ మోడల్ క్లాసిక్, హంటర్, బుల్లెట్ తర్వాత జె సిరీస్ ఇంజిన్‌లో.. వస్తున్న ఐదో మోడల్ అని చెప్పవచ్చు. గుండ్రని హెడ్‌ల్యాంప్, ఫార్వర్డ్ సెట్ పుట్ పెగ్‌లు, వృత్తాకార టెయిల్ ల్యాంప్ ఉండే అవకాశం ఉంది. క్లాసిక్ 350 మాదిరిగానే.. అదే ఇన్‌‌స్ట్రుమెంట్ కన్సోల్‌ అందించనున్నారు. ముందు వెనక డిస్క్ బ్రేకులు, రైడర్ల సేఫ్టీ కోసం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్‌ కూడా ఇందులో వస్తుంది.

గోవాన్ క్లాసిక్ 350లో ట్యూబ్యులర్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్‌కు మెరుగైన సస్పెన్షన్ ఇస్తున్నారు. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు అమరుస్తారు. 170 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా వస్తుంది. దీని అల్లాయ్ వీల్స్ అట్రాక్టివ్‌గా ఉంటాయి. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫిల్డ్ క్లాసిక్ 350 ధర రూ.1.93 లక్షల నుంచి రూ.2.30 లక్షల మధ్యలో ఉంది. అదే సమయంలో గోవాన్ క్లాసిక్ ధర క్లాసిక్‌కు దగ్గరలోనే ఉండే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం