Best selling sedan : క్లాసిక్​ లుక్​తో సరికొత్తగా వస్తున్న బెస్ట్​ సెల్లింగ్​ హోండా సిటీ సెడాన్​..-honda city facelift to break cover soon check details of this best selling sedan ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Selling Sedan : క్లాసిక్​ లుక్​తో సరికొత్తగా వస్తున్న బెస్ట్​ సెల్లింగ్​ హోండా సిటీ సెడాన్​..

Best selling sedan : క్లాసిక్​ లుక్​తో సరికొత్తగా వస్తున్న బెస్ట్​ సెల్లింగ్​ హోండా సిటీ సెడాన్​..

Sharath Chitturi HT Telugu
Nov 03, 2024 12:57 PM IST

Honda City facelift : హోండా సిటీ ఫేస్​లిఫ్ట్ లాంచ్​కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హోండా సిటీ ఫేస్​లిఫ్ట్​
హోండా సిటీ ఫేస్​లిఫ్ట్​

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ సెడాన్​ మోడల్స్​లో హోండా సిటీ ఒకటి. ఈ మోడల్​కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని తీసుకొచ్చేందుకు సంస్థ గత కొంత కాలంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక ఇప్పుడు ఈ హోండా సిటీ ఫేస్​లిఫ్ట్​పై కీలక అప్డేట్​ బయటకు వచ్చింది. ఈ మోడల్​ని నవంబర్​ 9న బ్రెజిల్​లో సంస్థ ఆవిష్కరించనుంది. ఈ మిడ్ సైజ్ సెడాన్ అప్​డేటెడ్ వర్షెన్ 2025లో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సెడాన్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హోండా సిటీ ఫేస్​లిఫ్ట్​..

హోండా సిటీ ఫేస్​లిఫ్ట్ అనేక కాస్మొటిక్ మార్పులతో వస్తుంది. ఇవి ఎక్కువగా సెడాన్ రేర్​లో కేంద్రీకృతమై ఉంటాయి. అయితే మెకానికల్ ఫ్రంట్​లో, కారు ఎటువంటి మార్పు లేకుండా వస్తుంది!

ఈ దశాబ్దం ప్రారంభం నుంచి సెడాన్ మార్కెట్ గణనీయంగా క్షీణించింది. ఎస్​యూవీలు, క్రాసోవర్లకు ఉన్న డిమాండ్ సెడాన్, హ్యాచ్​బ్యాక్​ మార్కెట్ వాటాను దెబ్బతీసింది. కానీ కొన్ని మోడల్స్​ని మాత్రం పోటీని తట్టుకుని సేల్స్​ కొనసాగించగలుగుతున్నాయి. వాటిల్లో హోడా సిటీ ఒకటి. ఇక సిటీ ఫేస్​లిఫ్ట్​ అమ్మకాలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

హోండా సిటీ ఫేస్​లిఫ్ట్: కీలక మార్పులు..

హోండా సిటీ ఫేస్​లిఫ్ట్ కొత్త రేడియేటర్ గ్రిల్​ను పొందింది. ఇది అప్​డేటెడ్ బంపర్​తో వస్తుంది. రేర్​ బంపర్​ను కూడా అప్​డేట్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇండియా-స్పెక్ హోండా సిటీ ఇప్పటికే ఈ బంపర్లతో వస్తుంది. ఆ సందర్భంలో, ఇండియా-స్పెక్ హోండా సిటీ ఫేస్​లిఫ్ట్ కొత్త గ్రిల్​ కలిగి ఉంటుంది. ఆ క్యాబిన్ లోపల, వైట్ ఓవర్ బ్లాక్ ఇంటీరియర్ ఉంటుంది. ఇది ఇండియా-స్పెక్ హోండా సిటీ ఈ:హెచ్​ఈవీలో అందుబాటులో ఉన్న దానిని పోలి ఉంటుంది.

బ్రెజిల్ మార్కెట్-బౌండ్ అప్​డేటెడ్ హోండా సిటీలో అతిపెద్ద మార్పు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్! ఇది సెడాన్ కోసం కీలకమైన కొత్త యూఎస్పీగా భారతదేశానికి రానుంది. క్యాబిన్ అప్​డేట్ చేసిన లేఅవుట్​ను కూడా అందుకుంటుంది. వైర్​లెస్ ఛార్జింగ్ ప్యాడ్​ను గేర్ షిఫ్టర్ వెనుకకు మార్చారు. ఇవి కాకుండా, బ్రెజిల్ హోండా సిటీ ఇప్పుడు ఇండియా-స్పెక్ మోడల్లో లభించే ప్రతిదాన్ని పొందుతుంది! ఈ జాబితాలో హోండా కనెక్ట్ సూట్, లెవల్ -2 ఏడీఏఎస్ సూట్, టాప్-స్పెక్ మోడల్​లోని ఫుల్ ఎల్​ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి.

హోండా సిటీ ఫేస్​లిఫ్ట్: ఇంజిన్​..

హోండా సిటీ ఫేస్​లిఫ్ట్ ప్రస్తుత మోడల్​లో ఉన్న అదే ఇంజిన్​ను కలిగి ఉంటుంది. 1.5-లీటర్ ఐ-వీటీఈసీ ఇంజిన్ 119 బీహెచ్​పీ పవర్, 145 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్​మిషన్ ఆప్షన్స్​లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్​బాక్స్​, సీవీటీ ఉంటాయి. ఇండియా-స్పెక్ మోడల్ హైబ్రిడ్ ఇంజిన్​ పొందుతుంది. సిటీ ఈ:హెచ్​ఈవీ ఇంజిన్​.. 100 బీహెచ్​​పీ పవర్​, 127 ఎన్ఎమ్ టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. ఇది అదనపు బూస్ట్ కోసం ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. బంపర్-టు-బంపర్ ట్రాఫిక్​లో మెరుగైన సామర్థ్యాన్ని అందిస్తుంది!

Whats_app_banner

సంబంధిత కథనం