Renault new EV : 620కి.మీ రేంజ్‌తో రెనాల్ట్ సీనిక్ ఈ-టెక్ ఈవీ..
05 September 2023, 8:05 IST
- Renault new EV : రెనాల్ట్ నుంచి సరికొత్త ఈవీ రాబోతోంది. అదే సీనిక్ ఈ-టెక్ ఈవీ. ఈ మోడల్‌ను తాజాగా ఆవిష్కరించింది ఆటోమొబైల్ సంస్థ.
620కి.మీ రేంజ్‌తో రెనాల్ట్ సీనిక్ ఈ-టెక్ ఈవీ..
Renault new EV : సీనిక్ ఈ-టెక్ ఈవీని తాజాగా ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ రెనాల్ట్. దీనిని సీఎంఎఫ్-ఈవీ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించనుంది. మెగేన్ ఈ-టెక్, నిస్సాన్ ఆరియా వంటి ప్రముఖ మోడల్స్‌ని కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఈవీ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త ఈవీ ఎలా ఉందంటే..
రెనాల్ట్ సీనిక్ ఈ-టెక్ ఎలక్ట్రిక్ వెహికిల్‌లో ఫ్లాట్ ఫ్లోర్, సోలార్బే పానోరమిక్ సన్‌రూఫ్, 545 లీటర్ల్ బూట్ స్పేస్ వంటివి వస్తున్నాయి. ఇక కేబినెల్లో 8.7 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ వస్తోంది. వీటిల్లో ఆర్మ్‌రెస్ట్, ఫోల్డ్-ఔట్ స్టాండ్స్, డ్రింక్ హోల్డర్స్, టైప్-సీ ఔట్లెట్స్ ఉంటాయి.
ఇక ఈ కారులోని ఓపెన్ఆర్ లింక్ డిజిటల్ కాక్‌పిట్‌లో 12.3 ఇంచ్ హారిజాంటల్ టీఎఫ్టీ స్క్రీన్ ఉంటుంది. 12.0 ఇంచ్ వర్టికల్ టచ్‌స్క్రీన్ దీని సొంతం. మొత్తం మీద ఇందులో 50కిపైగా యాప్స్ ఉంటాయని తెలుస్తోంది. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి కనెక్టివిటీ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.
Renault Scenic E-Tech EV : ఇక ఈ మోడల్లో రెండు వేరియంట్లు ఉంటాయి. ఒకటి స్టాండర్డ్, రెండోది హై. స్టాండర్డ్ వేరియంట్లో 60కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో కూడిన మోటార్ ఉంటుంది. ఇది 170హెచ్‌పీ పవర్‌ను, 280 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని రేంజ్ 418కి.మీలని సంస్థ చెబుతోంది.
ఇక రెండో వేరియంట్ 'హై'లో 220 హెచ్‌పీ పవర్‌ను, 300 ఎన్ఎంను జనరేట్ చేసే మోటార్ ఉంటుంది. దీనికి 87కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ లింక్ చేసి ఉంటుంది. దీని రేంజ్ 620కి.మీలని సంస్థ చెబుతోంది. అంతేకాకుండా.. ఈ రెండూ కూడా ఎన్ఎంసీ (నికిల్-మాంగనీస్-కోబాల్ట్) బ్యాటరీలను స్పష్టం చేస్తోంది.
Renault Scenic E-Tech price : ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌లో 30కిపైగా డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టెమ్స్తో పాటు దాదాపు అన్ని సేఫ్టీ ఫీచర్స్ వస్తున్నాయి.
రెనాల్డ్ సీనిక్ ఈ-టెక్ ఈవీలోని డ్యాష్‌బోర్డ్‌ను 80శాతం రీసైకిల్డ్ మెటీరియల్‌తో రూపొందించింది సంస్థ. కాక్‌పిట్‌లో 26శాతం రీసైకిల్డ్ మెటీరియల్‌ను వాడింది. కార్పెట్స్‌ను 97శాతం రీసైకిడ్ల్ ప్లాస్టిక్ బాటిల్స్‌తో తయారు చేసింది. గ్లాస్ రూఫ్‌ను 50శాతం వేస్ట్ మెటీరియల్స్‌తో, డోర్స్-హుడ్ను 40శాతం రీసైకిల్డ్ అల్యుమీనియం కాంపొనెంట్స్‌తో తయారు చేసింది.
Renault Scenic E-Tech electric : ఈ మోడల్ వచ్చే ఏడాది తొలినాళ్లల్లో యూరోప్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇండియాలో లాంచ్‌పై క్లారిటీ లేదు. ఈ మోడల్ ధర, ఇతర ఫీచర్స్ వంటి వివరాలపై సంస్థ ప్రకటన చేయాల్సి ఉంది.